మత్స్యకారుడి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్‌.. వీడియో ఇదిగో..!

Octopus wraps around fisherman face viral video
  • మత్స్యకారుడి ముఖానికి అతుక్కుపోయిన ఆక్టోపస్‌
  • టెంటకిల్స్‌తో తలను చుట్టేసిన వైనం
  • సక్కర్లతో నోటిని మూసేసిన ఆక్టోపస్‌
  • వెదురు కర్రతో ఆక్టోపస్‌ను కొట్టిన మత్స్యకారుడు
  • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వలలో చిక్కిన ఆక్టోపస్‌ను పడవలోకి తీసుకున్న క్షణాల్లోనే అది అతడిపై దాడి చేసింది. నేరుగా ముఖానికి అతుక్కుపోయి టెంటకిల్స్‌తో తలను చుట్టేసింది. నోటిని సక్కర్లతో మూసేసింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో అతడు ప్రాణభయంతో దాన్ని వదిలించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.

ఫిలిప్పీన్స్‌ సమీప సముద్రంలో గత నెల ఈ ఘటన జరిగినట్లు సమాచారం. జెస్సర్‌ సెర్వాంటెస్‌ అనే మత్స్యకారుడు చెక్క పడవలో చేపలు పడుతుండగా ఆక్టోపస్‌ వలకు చిక్కింది. దాన్ని పైకి తీసుకున్న వెంటనే అది ఒక్కసారిగా అతడి ముఖంపైకి దూసుకొచ్చింది. దాని టెంటకిల్స్‌ తల చుట్టూ బిగుసుకున్నాయి. బలమైన సక్కర్లు ముఖానికి అతుక్కుపోవడంతో సెర్వాంటెస్‌ దాన్ని చేతులతో తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఆక్టోపస్‌ అతడి నోటినీ కప్పేయడంతో ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో పక్కనే ఉన్న వెదురు కర్ర ముక్కను తీసుకున్న సెర్వాంటెస్‌ దానితో ఆక్టోపస్‌ను పదేపదే కొట్టాడు. కొంతసేపటి తర్వాత దాని పట్టు సడలింది. వెంటనే దాన్ని ముఖం నుంచి లాగి సముద్రంలోకి వదిలేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై సెర్వాంటెస్‌ స్పందిస్తూ.. తాను పట్టుకున్న ఆక్టోపస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైందని చెప్పాడు. అది తన ముఖాన్ని దాదాపుగా చీల్చేసినంత పని చేసిందని తెలిపాడు. ఆక్టోపస్‌ల టెంటకిల్స్‌పై ఉండే సక్కర్లు ఉపరితలాలకు బలంగా అతుక్కోగలవు. స్పర్శతో పరిసరాలను గుర్తించడంలోనూ అవి ఎంతో సమర్థంగా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌ సముద్ర జలాల్లో పలు రకాల ఆక్టోపస్‌లు కనిపిస్తాయి. వాటిలో కొబ్బరి ఆక్టోపస్‌, మిమిక్‌ ఆక్టోపస్‌ లాంటి జాతులతో పాటు అత్యంత విషపూరితమైన బ్లూ-రింగ్డ్‌ ఆక్టోపస్‌ కూడా ఉంది.
Advertisement
Jesser Cervantes
Octopus attack
Philippines fisherman
Viral video
Sea creature encounter
Marine animal attack

More Telugu News