రైలులో మహిళా మోడల్ వీరంగం: పోలీసుల ముందే దుస్తులు విప్పేసి.. బ్లేడ్‌తో పోలీసులపై దాడి
- ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో మోడల్ వీరంగం
- సీటు వివాదంతో పోలీసులపై బ్లేడుతో దాడి
- మోడల్ అంతరా బెనర్జీని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు
రైలులో సీటు కేటాయింపునకు సంబంధించిన ఓ చిన్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఓ మహిళా మోడల్ రైల్వే సిబ్బందిపై బ్లేడ్‌తో దాడి చేసి, వీరంగం సృష్టించిన ఘటన ముంబై నుంచి శ్రీ గంగానగర్ వెళ్తున్న ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో మహారాష్ట్రలోని థానేకు చెందిన మోడల్ అంతరా బెనర్జీ (31)ని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 12న రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సూరత్ వెళ్తున్న అంతరా బెనర్జీ, స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లోకి ప్రవేశించింది. అక్కడ రిజర్వ్ చేసి ఉన్న సీటులో కూర్చోవడంతో, అసలు ప్రయాణికుడు ఆమెను ఖాళీ చేయమని కోరాడు. ఆమె నిరాకరించడంతో, ఆ ప్రయాణికుడు టికెట్ చెకర్ (టీసీ) హరికేష్ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. టీసీ వచ్చి ప్రశ్నించడంతో అంతరా ఆగ్రహంతో ఊగిపోయి, దూషణలకు దిగింది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో టీసీ.. ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ యామిని కాంత్ మిశ్రా, కానిస్టేబుల్ రాజేష్ కుమార్‌లను పిలిపించారు. అధికారులతో ఆమె వాగ్వివాదం మరింత ముదిరింది. మాటామాటా పెరగడంతో, ఆమె ఒక్కసారిగా తన దుస్తులు విప్పేసి, చేతిలో ఉన్న రేజర్ బ్లేడ్‌తో ఏఎస్‌ఐ మిశ్రా, టీసీపై దాడికి పాల్పడింది. తనను తాను కూడా గాయపరుచుకుంది. ఈ ఘటనలో మహిళా అధికారి యూనిఫాం చిరగడంతో పాటు, ఆమె ఫోన్, కళ్లజోడు ధ్వంసమైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది బోగీ తలుపులు మూసివేయగా, ఆమె కిటికీ అద్దాన్ని పగలగొట్టి పారిపోయేందుకు ప్రయత్నించింది. చివరకు, దహాను రైల్వే స్టేషన్‌లో ఆమెను అదుపులోకి తీసుకుని, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ)కి అప్పగించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు.