వికాసం నుంచి వైభవం వైపు ఏపీ: సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం
- 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రసంగం
- 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన కోసం ఐక్యంగా పనిచేద్దామని పిలుపు
- గత పాలనలోని విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామన్న సీఎం
- రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, వచ్చే ఏడాది పోలవరం పూర్తిపై హామీ
- వివిధ శాఖల శకటాల ప్రదర్శన, ప్రతిభావంతులైన పోలీసులకు పతకాల ప్రదానం
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని వికాసం నుంచి వైభవం వైపు, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తున్నామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
"భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల పోరాటం, ఎందరో మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్ర్యం. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు కన్న కలలను సాకారం చేసి, 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడదాం. ఈ దేశానికి మనమేం ఇవ్వగలమని ఆలోచించడమే ‘అనే నేను...’ సంకల్పం. రాబోయే 20 ఏళ్లు దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత్ భారత్, మనం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాలు వేర్వేరు కావు. ఐక్యంగా ఈ లక్ష్యాలను సాధిద్దాం" అని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.
గత పాలన విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా విధ్వంసానికి గురైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "గత పాలకుల అహంకారం, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించాం. గత 26 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనే మా లక్ష్యం. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాం" అని తెలిపారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అన్ని అంశాల్లో కేంద్రం సహకరిస్తోందన్నారు. గత ప్రభుత్వ అప్పులను రీషెడ్యూల్ చేసి రూ.8,269 కోట్లు ఆదా చేశామని, రాష్ట్ర వృద్ధి రేటును 11.3 శాతానికి పెంచామని వివరించారు.
పెట్టుబడుల వెల్లువ, ఉద్యోగాల కల్పన
పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపేందుకు 28 కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. "ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. ఇప్పటికే రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా, వాటిలో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. తద్వారా 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దాల్మియా సిమెంట్, హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. 36 రోజుల్లోనే ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను నిరూపించాం. యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇకపై ఏటా డీఎస్సీ ఉంటుంది. ఇప్పటికే 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం" అని సీఎం పేర్కొన్నారు.
వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట
'అన్నదాత సుఖీభవ' కింద ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అందిస్తున్నామని, వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. "లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. మదనపల్లెలో త్వరలో హార్టికల్చర్ యూనివర్సిటీకి శ్రీకారం చుడతాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నాం. గత 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులపై రూ.25 వేల కోట్లు ఖర్చు చేశాం. మరో మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం. 30 ఏళ్ల కల అయిన వెలిగొండ ఫేజ్-1ను త్వరలో ప్రారంభిస్తున్నాం. వంశధార-నాగావళి అనుసంధానం 73 శాతం పూర్తయింది. వచ్చే ఏడాది పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం" అని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యత
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని సీఎం వివరించారు. రాష్ట్రంలో రూ.64 వేల కోట్ల రైల్వే పనులు, రూ.38 వేల కోట్ల హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామన్నారు. మహిళా సాధికారతకు 'స్వయం బ్రాండ్', పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నకిలీ మద్యంపై ఉక్కుపాదం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.30,849 కోట్ల బకాయిలు చెల్లించామని, ప్రజా భద్రతలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేశారు. 'ఈగల్ టాస్క్ ఫోర్స్' ద్వారా గంజాయి, డ్రగ్స్‌ను అణిచివేస్తున్నామని తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీసు దళాలు, ఎన్‌సీసీ, స్కౌట్స్ విద్యార్థులు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు.