బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ
- ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ
- ఈ నెల 17 నుంచి 8 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
- ప్రపంచస్థాయి బోధనా పద్ధతులపై అధ్యయనం, అమలు
- టుర్కు యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్
- ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం మంత్రి లోకేశ్ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌లో 37 మంది టీచర్లను సింగపూర్‌కు పంపిన ప్రభుత్వం, తాజాగా మరో 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ బృందం ఫిన్లాండ్‌లో పర్యటించనుంది.
‘అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం’లో భాగంగా విద్యారంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఫిన్లాండ్‌లోని అత్యుత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అక్కడి టుర్కు విశ్వవిద్యాలయంలో మన ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన టీచర్లు అంతర్జాతీయ విద్యావిధానాలు, వినూత్న బోధనపై ప్రత్యక్ష అనుభవం గడించి, రాష్ట్రంలో బోధన నాణ్యతను మరింత బలోపేతం చేయనున్నారు.
మూడు దశల్లో శిక్షణ కార్యక్రమం
ఈ శిక్షణా కార్యక్రమాన్ని మూడు దశల్లో పకడ్బందీగా అమలు చేసేలా రూపకల్పన చేశారు.
మొదటి దశ: ఇప్పటికే విజయవాడలో నలుగురు ఫిన్నిష్ నిపుణులతో 4 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం పూర్తయింది. ఇందులో ఫిన్లాండ్ విద్యావ్యవస్థ, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు ప్రాథమిక అవగాహన కల్పించారు.
రెండో దశ: ఆగస్టు 17 నుంచి 26 వరకు ఫిన్లాండ్‌లోని టుర్కు, రౌమా నగరాల్లో 8 రోజుల పాటు ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా తరగతి గదుల పరిశీలన, పాఠశాలల సందర్శన, అక్కడి విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు ఉంటాయి. బాల-కేంద్రిత అభ్యసన (Child-centred Learning), ఆనందదాయక బోధన (Joyful Pedagogy), ఆట ఆధారిత విద్య (Play-based Education) వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.
మూడో దశ: శిక్షణ అనంతరం ఆన్‌లైన్ ద్వారా మెంటరింగ్ సెషన్లు నిర్వహిస్తారు. టుర్కు విశ్వవిద్యాలయ నిపుణులు మన ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తూ, వారు తమ పాఠశాలల్లో అమలు చేసే ప్రాజెక్టులకు మద్దతు అందిస్తారు.
శిక్షణ అనంతరం కార్యాచరణ
ఫిన్లాండ్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు, అక్కడి బోధనా పద్ధతులను మన రాష్ట్రంలోని పాఠశాలల వాతావరణానికి అనుగుణంగా అమలు చేసేందుకు ఒక రోడ్‌మ్యాప్ రూపొందిస్తారు. వీరు తమ జిల్లాల్లోని తోటి ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్లుగా, మెంటర్లుగా వ్యవహరిస్తారు. ఆటపాటలతో కూడిన ఆనందదాయక అభ్యసన కోసం ఆదర్శ తరగతి గదులను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా నేర్చుకున్న విజయవంతమైన బోధనా పద్ధతులను రాష్ట్రవ్యాప్తంగా ఇతర పాఠశాలల్లోనూ ప్రచారం చేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, డిజిటల్ సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, అంతిమంగా విద్యార్థులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫౌండేషనల్ లెర్నింగ్‌ను బలోపేతం చేసి, ప్రతి విద్యార్థికి ప్రపంచ ప్రమాణాలతో కూడిన సమగ్ర విద్యను అందించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడనుంది.