కర్ణాటకలో గుట్కా, పాన్‌మసాలాపై ఒక ఏడాది నిషేధం
- ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్
- రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
కర్ణాటక ప్రభుత్వం గుట్కా, పొగాకు లేదా నికోటిన్ ఉన్న పాన్‌మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలపై ఒక ఏడాది పాటు రాష్ట్రవ్యాప్త నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006, సంబంధిత రెగ్యులేషన్ల కింద ఈ నిషేధం అమలులోకి వచ్చింది. పొగాకు లేదా నికోటిన్ ఉన్న గుట్కా, పాన్‌మసాలా మాత్రమే కాకుండా... ఏ పేరుతో అయినా అమ్ముతున్న ఇలాంటి ఉత్పత్తులు, ప్యాక్డ్ లేదా అన్‌ప్యాక్డ్ ఉత్పత్తులపై కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇలాంటి ఉత్పత్తుల్లో మాదకద్రవ్యాలు కలపడం జరుగుతోందని హెచ్చరించి, డ్రగ్-ఫ్రీ కర్ణాటక లక్ష్యంగా ముందుకు వెళతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.