పాన్‌ మసాలా ప్యాకింగ్‌ ఇలా ఉండాల్సిందే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొత్త రూల్స్‌

FSSAI new rules for Pan Masala packaging
  • పాన్‌ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆంక్షలు
  • అల్యూమినియం ఫాయిల్‌, మెటలైజ్డ్‌ లేయర్లపైనా నిషేధం
  • పేపర్‌, సెల్యులోజ్‌ వంటి సహజ పదార్థాలకు అనుమతి
  • టిన్‌, గాజు కంటైనర్ల వినియోగానికీ అవకాశం
  • కొత్త నిబంధనలు ఆగస్టు 10 నుంచే అమల్లోకి
పాన్‌ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌ వినియోగంపై భారత ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్‌ మసాలాను ప్లాస్టిక్‌, అల్యూమినియం ఫాయిల్‌, మెటలైజ్డ్‌ లేయర్లతో ప్యాక్‌ చేయకూడదు. ఈ మేరకు చేసిన సవరణలను ప్రభుత్వం ఇటీవలే గెజిట్‌లో ప్రచురించింది.

కొత్త నిబంధనల ప్రకారం పేపర్‌, పేపర్‌బోర్డ్‌, సెల్యులోజ్‌ లేదా సహజంగా లభించే ఇతర పదార్థాలతో పాన్‌ మసాలాను ప్యాక్‌ చేయొచ్చు. అయితే వాటిలో ఎలాంటి ప్లాస్టిక్‌ ఉండకూడదు. పాలిథిలీన్‌, పాలీప్రొపైలీన్‌, పాలిస్టర్‌, పీవీసీతో పాటు ఇతర సింథటిక్‌ పాలిమర్లు, కోపాలిమర్లు, లామినేట్లను కూడా ఉపయోగించరాదు.

పేపర్‌ ప్యాకేజింగ్‌లో లోపల ప్లాస్టిక్‌ లేదా మెటలైజ్డ్‌ పొర ఉన్నా కొత్త నిబంధనలకు అనుగుణంగా పరిగణించరు. పాన్‌ మసాలా ప్యాకేజింగ్‌కు టిన్‌, గాజు కంటైనర్లను కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతించింది.

ఈ నిబంధనలు గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. పాన్‌ మసాలాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కేవలం దాని ప్యాకేజింగ్‌కు ఉపయోగించే పదార్థాలపై ఆంక్షలు విధించింది.

ఏప్రిల్‌ 28న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. 60 రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించింది. వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలను ప్రకటించింది.
Advertisement
FSSAI
Pan Masala Packaging Rules
Plastic Ban on Pan Masala
Food Safety Standards India
Eco Friendly Packaging Regulations
Pan Masala New Guidelines

More Telugu News