2026 ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
- ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
- హైదరాబాద్‌లోని స్టేడియాల ఆధునికీకరణకు అధికారులకు ఆదేశాలు
- ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలను ఆహ్వానించాలని సూచన
ప్రతిష్ఠాత్మక ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026’ను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మెగా క్రీడా ఈవెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ క్యాంపస్‌లోని బోధి పెవిలియన్‌లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ జాతీయ స్థాయి క్రీడల్లో పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని స్టేడియాల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి, క్రీడల నిర్వహణకు అనుగుణంగా వాటిని శాశ్వత ప్రాతిపదికన ఆధునికీకరించాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నందున, ప్రతి క్రీడకు వేదికలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రారంభ, ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులను, ప్రఖ్యాత క్రీడాకారులను, సినీ ప్రముఖులను ఆహ్వానించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈవెంట్ నిర్వహణలో అధికారులకు మౌలిక వసతులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, అతిథుల సౌకర్యాలపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు.
ఈవెంట్ విజయవంతం కావడానికి రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్ అసోసియేషన్, జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం అన్నారు. ప్రతి ఈవెంట్‌ను నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఛైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, శాట్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.