మరోసారి 'చిరు లీక్స్'... తన 158వ సినిమా టైటిల్ చెప్పేసిన మెగాస్టార్!
- తన 158వ సినిమా టైటిల్‌ను లీక్ చేసిన చిరంజీవి
- బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రానికి 'కదిరి'గా నామకరణం
- మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న టీజర్ విడుదల
- వరుణ్ తేజ్ సినిమా సక్సెస్ మీట్‌లో సరదాగా టైటిల్ చెప్పేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని అనుకోకుండా బయటపెట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్‌లో తన 158వ సినిమా టైటిల్‌ను ఆయనే స్వయంగా లీక్ చేశారు. దీంతో #ChiruLeaks అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'కదిరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి సరదాగా వేదికపై వెల్లడించారు. ఈవెంట్‌లో లీక్‌ల గురించి ప్రస్తావన రాగా, సంగీత దర్శకుడు తమన్ వద్దని వారిస్తున్నా, "టీజర్ మ్యూజిక్ అయ్యిందా? చివర్లో 'కదిరి' అని టైటిల్ పెట్టారా?" అని చిరంజీవి అడగడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాదు తన పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటి రచితా రామ్, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, లోకేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.