రూ.37 వేల జీతం నుంచి రూ.2.2 కోట్ల ప్యాకేజీ.. 11 ఏళ్లలో టెకీ సంచలన కెరీర్
- 2015లో రూ.37 వేల నెల జీతంతో కెరీర్ ప్రారంభించి టెకీ
- ప్రమోషన్లు, కంపెనీలు మారడంతో భారీగా పెరిగిన ప్యాకేజీ
- ఫాంగ్ స్థాయి కంపెనీల్లో ఉద్యోగం సాధిస్తూ కెరీర్ నిర్మించుకున్న టెకీ
- మధ్యలో స్టార్టప్ ప్రారంభించి.. మళ్లీ ఉద్యోగ జీవితంలోకి వచ్చిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కెరీర్ స్టోరీ
చేతిలో ఉన్న జీతం ఎంత అన్నది కాదు.. కెరీర్‌లో ఎక్కడికి చేరుకున్నామన్నదే ముఖ్యం. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రయాణం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకు రూ.37 వేల జీతంతో మొదలైన అతడి కెరీర్ 11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు చేరింది. మధ్యలో ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు, స్టార్టప్ ప్రయోగం, విరామం.. ఎన్నో మలుపులు ఎదురైనా అతడు ముందుకు సాగాడు.
తొలి అడుగు రూ.37 వేలతో
కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఈ టెకీ 2015లో తొలి ఉద్యోగంలో చేరాడు. అక్కడ మంచి టెక్ కల్చర్ ఉండటంతో వాస్తవ ప్రపంచంలో పనిచేసే అనుభవం సంపాదించాడు. నాలుగేళ్ల తర్వాత ప్రమోషన్‌తో నెల జీతం రూ.1.1 లక్షలకు పెరిగింది.
ఒక్క మార్పుతో భారీ జంప్
2019లో ‘ఫాంగ్’ (FAANG-ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) స్థాయి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. దీంతో ఏడాది ప్యాకేజీ రూ.44 లక్షలకు చేరింది. 2020లో కొవిడ్ సమయంలో పని ఒత్తిడి పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెండు నెలల్లోనే అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ స్టార్టప్‌లో రూ.50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకున్నాడు.
స్టార్టప్ ప్రయోగం
ఎనిమిది నెలల్లోనే ప్రమోషన్ రావడంతో ప్యాకేజీ రూ.65 లక్షలకు పెరిగింది. 2021 చివరికి అది దాదాపు రూ.70 లక్షలకు చేరింది. 2022లో సొంత ఫిన్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించి సీఎస్‌టీఓ బాధ్యతలు చేపట్టాడు. లైసెన్సుల సమస్యలు తలెత్తడంతో 2024లో స్టార్టప్‌ను మూసివేశాడు.
మళ్లీ ఉద్యోగంలోకి
2024 ఆగస్టులో ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. ఓ భారతీయ స్టార్టప్‌లో టెక్ లీడర్‌గా రూ.1.2 కోట్ల ప్యాకేజీతో చేరాడు. అయితే అక్కడి పని వాతావరణం నచ్చక ఉద్యోగాన్ని వీడాడు.
రూ.2 కోట్ల మార్క్ దాటాడు
2025 ఫిబ్రవరిలో మరో ‘ఫాంగ్’ కంపెనీలో రూ.1.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. 2026 మార్చిలో ప్రమోషన్ రావడంతో ప్యాకేజీ రూ.2 కోట్లను దాటింది. స్టాక్ పెరుగుదలతో ప్రస్తుతం మొత్తం ప్యాకేజీ దాదాపు రూ.2.2 కోట్లకు చేరిందని అతడు వెల్లడించాడు.
నెటిజన్ల నుంచి ప్రశంసలు
అతడి కెరీర్ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు తమ కెరీర్ సందేహాలను అతడిని అడిగారు. టైర్-3 కాలేజీ నుంచి వచ్చినా కొన్నేళ్లలో భారీ ప్యాకేజీ సాధించిన వారిని ప్రోత్సహించే కథగా దీన్ని పలువురు అభివర్ణించారు.