ఫొటోలో రాహుల్‌ గాంధీతో ఉన్న మహిళ ఎవరు?.. కేంద్ర మంత్రి ట్వీట్‌పై దుమారం

Rahul Gandhi photo with woman sparks political row after Union Minister tweet
  • రాహుల్‌ గాంధీ ఫొటోపై గిరిరాజ్‌ సింగ్‌ ప్రశ్నలు
  • ఫొటో ఎక్కడ? ఎప్పుడు? తీశారని ప్రశ్న
  • రాహుల్‌తో ఉన్నది ఎవరని కేంద్ర మంత్రి ఆరా
  • ఫొటోలో ఉన్నది స్నేహితుడి కుటుంబమని కాంగ్రెస్‌ వివరణ
  • టెక్సాస్‌లో ఫొటో తీసినట్లు అవి దండియా వెల్లడి
  • గిరిరాజ్‌పై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా తీవ్ర విమర్శలు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ మహిళ, చిన్నారితో పడవలో ఉన్న ఫొటోపై రాజకీయ దుమారం రేగింది. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఫొటో ఎక్కడ? ఎప్పుడు? తీశారో చెప్పాలని కోరారు. రాహుల్‌తో ఉన్నది ఎవరని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ స్పందించింది. ఫొటోలో ఉన్న మహిళ, చిన్నారి రాహుల్‌ స్నేహితుడి భార్య, కుమారుడేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా  తెలిపారు. వారంతా కుటుంబ విహారయాత్రలో ఉన్నప్పుడు ఈ ఫొటో తీశారని చెప్పారు. రాహుల్‌ స్నేహితుడు మాత్రం చిత్రంలో లేరని వివరించారు.

ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి అవి దండియా మరో వివరాన్ని వెల్లడించారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న లేక్‌ రే రాబర్ట్స్‌ వద్ద ఈ ఫొటో తీసినట్లు తెలిపారు. గిరిరాజ్‌ సింగ్‌ స్వయంగా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

గిరిరాజ్‌ సింగ్‌ తీరుపై సుప్రియా తీవ్రంగా స్పందించారు. మహిళ, పురుషుడు కలిసి కనిపిస్తేనే చెడు ఆలోచనలు వస్తున్నాయంటూ విమర్శించారు.

రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు కొనసాగిస్తోంది. జూన్‌ 22 నుంచి జులై 13 వరకు ఆయన చేపట్టిన విదేశీ పర్యటనపై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ గతంలో ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? పర్యటన ఖర్చులను ఎవరు భరించారని ప్రశ్నించారు.

రాహుల్‌ విదేశీ పర్యటనల ఖర్చులు, భద్రతా నిబంధనలపైనా బీజేపీ గతంలో ఆరోపణలు చేసింది. విదేశీ పర్యటనలకు భారీగా ఖర్చు చేశారని ఆరోపించింది. అయితే తాజా ఫొటోపై మాత్రం కాంగ్రెస్‌ వివరణ ఇచ్చి.. అందులో ఉన్న మహిళ, చిన్నారి ఎవరన్న విషయాన్ని స్పష్టం చేసింది.
Advertisement
Rahul Gandhi
Giriraj Singh
Supriya Shrinate
Lake Ray Roberts Texas
Congress BJP controversy
Rahul Gandhi viral photo

More Telugu News