ఉద్యోగుల డేటా లీక్ ఆరోపణలు.. స్పందించిన టీసీఎస్
- డేటా బ్రీచ్ ఆరోపణలను ఖండించిన టీసీఎస్
- తమ సిస్టమ్స్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టత
- ఆన్‌లైన్‌లో ఉన్నది నాలుగేళ్ల నాటి పాత సమాచారమేనని వెల్లడి
- కస్టమర్ల డేటా, ఆపరేషనల్ సిస్టమ్స్ సురక్షితమని హామీ
- బలమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయని తెలిపిన కంపెనీ
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ సిస్టమ్స్‌లో డేటా ఉల్లంఘన జరిగినట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. తమ వ్యవస్థల్లో గానీ, కస్టమర్ల సమాచారానికి సంబంధించి గానీ ఎటువంటి చొరబాటు జరిగినట్లు విశ్వసనీయ ఆధారాలు లేవని సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారిక సమాచారం అందించింది.
కొంతమంది ఉద్యోగుల సమాచారం ఆన్‌లైన్‌లో బహిర్గతమైందన్న వార్తలపై దర్యాప్తు చేపట్టినట్లు టీసీఎస్ తెలిపింది. సదరు డేటా నాలుగేళ్ల క్రితం నాటిదని, అందులో కేవలం ప్రాథమిక ఉద్యోగ వివరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటన కారణంగా కస్టమర్ల డేటాకు గానీ, కంపెనీ నిర్వహణ వ్యవస్థలకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టం చేసింది.
పాస్‌వర్డ్ స్ప్రేయింగ్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫెటీగ్ వంటి పద్ధతుల్లో తాము దాడి చేసినట్లు హ్యాకర్లు పేర్కొన్నారని, అయితే ఇటువంటి సైబర్ దాడులను తిప్పికొట్టేందుకు గత రెండేళ్లుగా తమ వద్ద అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయని టీసీఎస్ వివరించింది. తమ భద్రతా వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అంతర్గత సమీక్షలో తేలిందని కంపెనీ వెల్లడించింది.
తమ ఉద్యోగుల పేర్లు, ఐడీలు, ఫోన్ నంబర్లు వంటి వివరాలు ఒక హ్యాకింగ్ ఫోరమ్‌లో ప్రత్యక్షమయ్యాయని కథనాలు వెలువడటంతో టీసీఎస్ ఈ వివరణ ఇచ్చింది. తమ వ్యవస్థల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.