గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? ఫొటోల బ్యాకప్ విషయంలో నేటి నుంచి కీలక మార్పు!
- డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్‌లో ఫొటోస్ ఆటో బ్యాకప్ నేటి నుంచి నిలిపివేత
- కంప్యూటర్ ఫోల్డర్ల నుంచి కొత్త ఫొటోలు అప్‌లోడ్ కావు
- ఇప్పటికే బ్యాకప్ చేసిన ఫొటోలు సేఫ్
- కొనసాగనున్న గూగుల్ డ్రైవ్ సాధారణ ఫైల్ సింక్ సర్వీస్
- గూగుల్ ఫొటోస్‌లో ‘బ్యాకప్ ఫోల్డర్స్’తో కొత్త సెటప్
- డ్రైవ్‌లోని ఫొటోలు ఫొటోస్‌లోకి ఇంపోర్ట్
కంప్యూటర్‌లోని ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ ద్వారా గూగుల్ ఫొటోస్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకుంటున్నారా? అయితే ఈరోజు నుంచి ఆ సదుపాయం నిలిచిపోనుంది. 2026 ఆగస్టు 10 నుంచి ‘గూగుల్ డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’ ద్వారా గూగుల్ ఫొటోస్‌కు ఆటోమేటిక్ బ్యాకప్ ఉండదని గూగుల్ స్పష్టం చేసింది. దీంతో కంప్యూటర్‌లోని ఎంపిక చేసిన ఫోల్డర్ల నుంచి కొత్త ఫొటోలు, వీడియోలు ఇక గూగుల్ ఫొటోస్‌లోకి ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ కావు.
ఇప్పటివరకు ‘డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’లో కంప్యూటర్‌లోని ఓ ఫోల్డర్‌ను ఎంచుకుంటే అందులోని ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్‌కు ఆటోమేటిక్‌గా బ్యాకప్ అయ్యేవి. ఇకపై ఈ సదుపాయం పూర్తిగా నిలిచిపోతుంది. అయితే ఇప్పటికే గూగుల్ ఫొటోస్‌లో బ్యాకప్ అయిన ఫొటోలు, వీడియోలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి సేఫ్‌గానే ఉంటాయి.
అలాగే గూగుల్ డ్రైవ్ సేవ కూడా ఆగిపోవడం లేదు. కంప్యూటర్‌లో ఫైళ్లను డ్రైవ్‌తో సింక్ చేసుకునే సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. డ్రైవ్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫొటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా పంపించే అనుసంధానాన్ని మాత్రమే గూగుల్ తొలగిస్తోంది.
ఇక ఏం చేయాలి?
కంప్యూటర్‌లోని ఫొటోలకు బ్యాకప్ కొనసాగించాలనుకునే వారు గూగుల్ ఫొటోస్‌లోనే కొత్తగా సెటప్ చేసుకోవాలి. గూగుల్ ఫొటోస్‌లో ‘+’ (ప్లస్) బటన్‌ను ఎంచుకుని ‘బ్యాకప్ ఫోల్డర్స్’ ఆప్షన్ ద్వారా కంప్యూటర్‌లోని ఫోల్డర్లను ఎంపిక చేసుకోవచ్చు.
ఇప్పటికే గూగుల్ డ్రైవ్‌లో ఉన్న ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లోకి నేరుగా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే పాత డ్రైవ్ అనుసంధానంతో పోలిస్తే కొత్త విధానంలో ఓ తేడా ఉంది. గూగుల్ ఫొటోస్ వెబ్‌సైట్ బ్రౌజర్‌లో తెరిచి ఉన్న సమయంలోనే ఫోల్డర్ బ్యాకప్ కొనసాగుతుంది.
ఫోన్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫొటోలు బ్యాకప్ చేసుకునే వారికి ఈ మార్పుతో ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే కెమెరా నుంచి కంప్యూటర్‌కు ఫొటోలు తీసుకోవడం, స్కాన్ చేసిన పత్రాలను భద్రపరచడం వంటి వాటికి ‘డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’ బ్యాకప్‌పై ఆధారపడుతున్న వారు మాత్రం కొత్త సెటప్ చేసుకోవాలి. లేకపోతే ఆగస్టు 10 తర్వాత కొత్త ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాకప్ కావు.