బలూచిస్థాన్‌లో ఉద్రిక్తత.. సురబ్ జిల్లాలో కర్ఫ్యూ, పలుచోట్ల ఆంక్షలు

Tensions in Balochistan Curfew in Surab District and Restrictions in Several Places
  • బలూచిస్థాన్‌లోని సురబ్ జిల్లాలో పాక్ అధికారుల కర్ఫ్యూ
  • ఆగస్టు 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 9 వరకు ఆంక్షలు
  • శాంతిభద్రతల సమస్యలే కారణమని ప్రభుత్వ ప్రకటన
  • ఖుజ్దార్ జిల్లాలోనూ రాత్రిపూట మార్కెట్లు మూసివేత
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెంట్రల్ బలూచిస్థాన్‌లోని సురబ్ జిల్లాలో అధికారులు కర్ఫ్యూ విధించారు.

అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు సురబ్ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తలెత్తే పరిణామాలకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇదే సమయంలో, పొరుగున ఉన్న ఖుజ్దార్ జిల్లాలోనూ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మార్కెట్లు, దుకాణాలు, హోటళ్లు సహా అన్ని వాణిజ్య సముదాయాలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

గత నెలలో సురబ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల కూలీ సయీద్ అహ్మద్‌ను ఐఎస్ఐ, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లారని బలూచ్ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే, ఆగస్టు 4న ఖుజ్దార్‌లో ఇనాయతుల్లా జట్టక్ అనే పౌరుడిని దుండగులు కాల్చి చంపారు. స్థానిక డెత్ స్క్వాడ్ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆయన కుమార్తె బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే ఈ హత్య జరగడం గమనార్హం. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే అధికారులు తాజా ఆంక్షలు విధించారని బలూచ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.                                
Advertisement
Balochistan
Surab District Curfew
Pakistan Security Situation
Khuzdar Restrictions
Baloch Human Rights
Saeed Ahmed Disappearance

More Telugu News