రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి షిరీన్ బేగం కుమార్తె ఆసిఫా మృతి

Shaik Asifa daughter of IPS Shireen Begum dies in Guntur road accident
  • గుంటూరు ఏటుకూరు బైపాస్‌లో లారీ, కారు ఢీ
  • స్నేహితులతో సూర్యలంక బీచ్‌కు వెళ్తుండగా ఘటన
  • కుమార్తె మృతి వార్త విని ఆసుపత్రిలో కుప్పకూలిన తల్లి
గుంటూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఐపీఎస్ అధికారి కుమార్తె దుర్మరణం చెందారు. నగరంలోని ఏటుకూరు బైపాస్ రోడ్డుపై ఆదివారం లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐపీఎస్ అధికారి షిరీన్ బేగం కుమార్తె షేక్ ఆసిఫా (24) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.

ఆసిఫా తన నలుగురు స్నేహితులతో కలిసి కారులో సూర్యలంక బీచ్‌కు విహారయాత్ర నిమిత్తం బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆసిఫాను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ప్రమాద వార్త తెలుసుకున్న షిరీన్ బేగం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ స్పృహతప్పి పడిపోయారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.                                
Advertisement
Shaik Asifa
Shireen Begum IPS
Guntur road accident
Etukuru bypass accident
Suryalanka beach trip accident
IPS officer daughter death

More Telugu News