మహిళా ఎస్ఐ ప్రవల్లికతో దురుసు ప్రవర్తన.. వైసీపీ నేత చింతాడకు రిమాండ్

Chintada Ravikumar remanded for misbehavior with female SI Pravallika
  • రవికుమార్‌ను జైలుకు తరలించిన పోలీసులు
  • జగన్ పర్యటనలో బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సైపై దాడి కేసులో అరెస్ట్
  • ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 14 మందికి రిమాండ్ 
బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జ్‌ చింతాడ రవికుమార్‌కు శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు వారిని అంపోలు జైలుకు తరలించారు.

ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జ మహిళా ఎస్సై ప్రవల్లికతో చింతాడ రవికుమార్‌తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. విధి నిర్వహణకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్సై పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా చింతాడ రవికుమార్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనను, మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 14 మంది నిందితులకు కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Chintada Ravikumar
SI Pravallika
YSRCP leader arrest
Srikakulam news
Amadalavalasa politics
Woman SI misbehavior case

More Telugu News