డాక్టర్ ప్రియాంక మృతి బాధాకరం.. నిందితులకు కఠిన శిక్ష తప్పదు: పవన్ కల్యాణ్

Dr Priyanka death is painful and culprits will be punished says AP Deputy CM
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ డాక్టర్ ప్రియాంక మృతి
  • మద్యం మత్తులో యువకులు నడిపిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు
  • ప్రియాంక మృతి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
  • నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్న పవన్
  • మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
రాజమహేంద్రవరంలో కొద్దిరోజుల ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక, హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మద్యం మత్తులో కొందరు యువకులు మితిమీరిన వేగంతో, అత్యంత నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమెను ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తులో వైద్యురాలిగా సమాజానికి ఎంతో సేవ చేయాల్సిన ప్రియాంక అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఈ హృదయవిదారక ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. "డాక్టర్ ప్రియాంక మృతి వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది" అని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ విపత్కర సమయంలో ప్రియాంక కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.                                
Advertisement
Dr Priyanka
Pawan Kalyan
Rajamahendravaram car accident
AP Deputy CM
Drunk driving case
Medical student death

More Telugu News