డేటింగ్ యాప్‌లో పరిచయం.. బ్లాక్‌మెయిల్‌తో రూ. 6 కోట్లు వసూలు చేసిన మహిళ!
- డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళ
- అత్యాచారం, హత్యాయత్నం కేసులు పెడతానని బెదిరింపులు
- పల్లవి సింగ్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
డేటింగ్ యాప్‌ల ద్వారా పురుషులను పరిచయం చేసుకుని, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. టిండర్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా పురుషులతో స్నేహం పెంచుకుని, ఆపై వారిని బెదిరించి సుమారు రూ. 6 కోట్లకు పైగా దండుకున్నట్లు పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళపై కేసు నమోదైంది.
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక హైకోర్టు న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. పల్లవి తొలుత డేటింగ్ యాప్‌ల ద్వారా పురుషులకు వల వేసేదని, ఆపై వారితో సన్నిహితంగా మెలిగి రహస్యంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ దృశ్యాలను అడ్డం పెట్టుకుని అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు పెడతానని బెదిరిస్తూ బాధితుల నుంచి భారీగా సొమ్ము డిమాండ్ చేసేదని బాధితుడు ఆరోపించారు.
ఈ బెదిరింపులకు భయపడి పలువురు బాధితులు ఆమెకు రూ. 6 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె పెట్టిన తప్పుడు కేసుల కారణంగా ఇప్పటికే ఐదుగురు వ్యక్తులు జైలుపాలయ్యారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. పల్లవి 'స్వీటీ తివారీ' అనే మారుపేరుతో ఈ దందాను నడిపించిందని, ఈ అక్రమాల్లో ఆమెకు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్, లక్నో నగరాల్లో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.