జియో యూజర్లకు కొత్త ఓటీటీ ప్లాన్లు.. త్రైమాసిక, వార్షిక ఆప్షన్లు!

Reliance Jio launches new quarterly and annual OTT plans for users
  • రూ. 550, రూ. 2000 ధరలతో అందుబాటులోకి వచ్చిన కొత్త ప్యాక్‌లు
  • హై-స్పీడ్ డేటా, అపరిమిత 5G సేవలతో పాటు 15 ఓటీటీ యాప్‌లు
  • యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి యాప్‌లకు యాక్సెస్
  • దీర్ఘకాలిక యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపకల్పన
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఓటీటీ రేంజ్ ని మరింత విస్తరించింది. దీర్ఘకాలిక ప్లాన్లను ఆశించే వినియోగదారుల కోసం త్రైమాసిక, వార్షిక ఓటీటీ పాస్‌లను కొత్తగా ప్రవేశపెట్టింది. రూ. 550, రూ. 2,000 ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ల ద్వారా డేటా ప్రయోజనాలతో పాటు ప్రీమియం స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 200 నెలవారీ ప్లాన్‌కు అదనంగా ఈ నూతన ప్లాన్లను జియో పరిచయం చేసింది.

రూ. 550 ప్లాన్
ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 90 జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ సేవలు లభిస్తాయి. మూడు నెలల కాలపరిమితి లేదా వార్షిక బేస్ ప్లాన్ కలిగిన వినియోగదారులు ఈ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు.

రూ. 2,000 ప్లాన్
ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. ఇది 365 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత 5జీ సేవలను అందిస్తుంది. అయితే, కేవలం వార్షిక బేస్ ప్లాన్ కలిగిన వారు మాత్రమే ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ మూడు రకాల ఓటీటీ పాస్‌లలోనూ వాయిస్ కాలింగ్ సౌకర్య ఉండదు. అయితే, యూట్యూబ్ ప్రీమియం, జియోహాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో (ప్రైమ్ లైట్/మొబైల్ ఎడిషన్), సోనీలివ్, జీ5, సన్‌నెక్స్ట్ వంటి 15కు పైగా ప్రీమియం ఓటీటీ యాప్‌లను వీటి ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వీటితో పాటు జియోటీవీ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే అవకాశం ఉంది.

ఆగస్టు 7 నుంచి ఈ కొత్త ప్లాన్లు మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్, అధీకృత రిటైల్ కేంద్రాలలో రీఛార్జ్ కోసం అందుబాటులోకి వచ్చాయి. దీర్ఘకాలిక సబ్‌స్క్రైబర్లకు అంతరాయం లేని వినోదాన్ని, అత్యుత్తమ విలువను అందించడమే ఈ ప్లాన్‌ల ప్రధాన ఉద్దేశమని జియో వెల్లడించింది.
Advertisement
Reliance Jio
Jio OTT Pass
Jio Recharge Plans
OTT Subscription
Jio 5G Data Plans
Jio Entertainment Packs

More Telugu News