తొలి బిడ్డ కోసం సమంత సన్నద్ధత.. ఆ పుస్తకం చదువుతూ పోస్ట్!
- తొలి బిడ్డ కోసం సిద్ధమవుతున్న నటి సమంత
- ప్రసవంపై అవగాహన పెంచే పుస్తకం చదువుతున్న ఫొటో షేర్
- ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆగస్ట్ ఎనర్జీ' పేరిట పోస్ట్ చేసిన నటి
- డిసెంబర్‌లో సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు తొలి సంతానం
- 'మా ఇంటి బంగారం' తర్వాత మెటర్నిటీ బ్రేక్ ప్రకటించిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన గర్భధారణ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఆమె, మాతృత్వానికి సంబంధించిన సన్నాహాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తాను చదువుతున్న ఓ పుస్తకం తాలూకు ఫొటోను శనివారం అభిమానులతో పంచుకున్నారు.
'ఆగస్ట్ ఎనర్జీ' అనే క్యాప్షన్‌తో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అందులో ఆమె సోఫాలో విశ్రాంతి తీసుకుంటూ 'ఇనా మేస్ గైడ్ టు చైల్డ్‌బర్త్' అనే పుస్తకాన్ని చదువుతూ కనిపించారు. కాబోయే తల్లిదండ్రులకు ప్రసవానికి సంబంధించిన వివిధ అంశాలపై ఈ పుస్తకం అవగాహన కల్పిస్తుంది. ఈ పోస్టులో జిమ్ సెల్ఫీలతో పాటు తన భర్త పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన మధుర క్షణాలను కూడా ఆమె పంచుకున్నారు.
గత జూన్ నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో సమంత తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. "ఈ సినిమా తర్వాత నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చిన్న విరామం తీసుకుంటాను. మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ నా అభిమానుల కోసం మరో సినిమాతో తిరిగి వస్తాను" అని ఆమె స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ 2025లో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో రాజ్ నిడిమోరును సమంత వివాహం చేసుకున్నారు.