తాడేపల్లిలో బ్రహ్మం చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇటీవల బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరి
- చికిత్స అనంతరం కోలుకుంటున్న వైనం
- తాడేపల్లిలో బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు
- అన్ని విధాలా అండగా ఉంటామని బ్రహ్మం చౌదరికి భరోసా ఇచ్చిన సీఎం
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై, చికిత్స అనంతరం తాడేపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను సీఎం స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మం చౌదరి కుటుంబ సభ్యులతోనూ చంద్రబాబు మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఇటీవల బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన విషయం తెలిసిందే. ఆయన తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షించి చిన్నమెదడులో మూడు చోట్ల రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. అత్యవసర చికిత్స అనంతరం బ్రహ్మం చౌదరి క్రమంగా కోలుకుంటున్నారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నేరుగా ఆయన నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తిగా కోలుకునేంత వరకు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులకు సీఎం సూచించినట్లు సమాచారం.