కాంగ్రెస్ ఉద్యమం కన్నా సీజేపీ ఉద్యమానికే ఎక్కువ స్పందన: శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- కాంగ్రెస్ ప్రచారం కన్నా సీజేపీ ఉద్యమానికే ఎక్కువ ఆదరణ లభించిందని వ్యాఖ్య
- విద్యార్థుల సమస్యలను రాహుల్ గాంధీ ముందే ప్రస్తావించారని వెల్లడి
- ప్రజల నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడిందని అంగీకారం
- 2029 ఎన్నికల్లో జెన్-జీ ఓటర్లు అత్యంత కీలకం కానున్నారని వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సమస్యలు, పరీక్షల్లో అక్రమాలపై తమ పార్టీ నేత రాహుల్ గాంధీ 'ఛాత్రోం కీ గూంజ్' పేరిట ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఉద్యమానికే ప్రజల నుంచి, ముఖ్యంగా విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన అంగీకరించారు.
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ, "సీజేపీ చేపట్టిన అంశాలనే మా పార్టీ, రాహుల్ గాంధీ 'ఛాత్రోం కీ గూంజ్' ద్వారా కొన్నిరోజుల ముందే లేవనెత్తారు. కానీ ఆ ప్రచారానికి ఎందుకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదో మేం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల నాడిని మేము సరిగ్గా పట్టుకోవాలి" అని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్‌లోని కోటాలో జూన్ 17న రాహుల్ గాంధీ ఈ ప్రచారాన్ని ప్రారంభించగా, సీజేపీ నిరసనలు జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మొదలయ్యాయి. సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విషయాన్ని శశిథరూర్ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు.
2029 నాటికి 'జెన్-జీ' అతిపెద్ద ఓటింగ్ వర్గంగా మారుతుందని, వారి ఆకాంక్షలను రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలని శశిథరూర్ సూచించారు. "వీధిలో చేయాల్సిన పోరాటం వీధిలో, సభలో చేయాల్సిన పోరాటం సభలో చేయాలి" అంటూ తమ పార్టీ వ్యూహంపై తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.
ఐఐఎంయూఎన్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకావడం, అదే వేదికపై శశిథరూర్ కూడా కనిపించడంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించవద్దని చెప్పడం సరికాదని, తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే ఉంటూ తన స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.