భీమవరంలో 'కొరియన్ కనకరాజు' సందడి.. రేపే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- రేపు (ఆగస్టు 4) భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో వేడుక
- 'కొరియన్ కనకరాజు' పై ఇప్పటికే భారీ అంచనాలు
- యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం
- ఆగస్టు 7న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని రేపు (ఆగస్టు 4) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి ఈ వేడుక జరగనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
'కొరియన్ కనకరాజు' చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈ వేడుకలో చిత్ర హీరో, హీరోయిన్లు సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సందడి చేయనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది.
ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలను నెలకొల్పిన 'కొరియన్ కనకరాజు' చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భీమవరంలో జరగనున్న ఈ వేడుకతో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కాగా, ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పవన్ ఇటీవల భుజానికి సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో, ఆయన ఇంకా బ్యాండేజ్ తోనే కనిపిస్తున్నారు. దాంతో, ఈ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ.