Advertisement

కుమారుడు పనిచేసే గూగుల్ ఆఫీస్‌ను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు... వీడియో ఇదిగో!

Parents visit sons Google office viral video makes netizens emotional
  • బెంగళూరు గూగుల్ ఆఫీస్‌కు తొలిసారి వెళ్లిన టెక్కీ తల్లిదండ్రులు
  • 'నా ఆఫీస్, వాళ్ల గర్వం' క్యాప్షన్‌తో కొడుకు వీడియో షేర్
  • కొడుకు ఆఫీస్‌ను చూసి గర్వంతో మురిసిపోయిన తల్లిదండ్రులు
తాము పనిచేసే కార్యాలయానికి తల్లిదండ్రులను తొలిసారి తీసుకెళ్లినప్పుడు యువత ముఖాల్లో కనిపించే ఆనందం, గర్వం అనిర్వచనీయం. సరిగ్గా ఇటువంటి ఓ అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియోను బెంగళూరుకు చెందిన ఓ గూగుల్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అది ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

బెంగళూరులో గూగుల్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువకుడు, తన తల్లిదండ్రులను తొలిసారిగా తన కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, "నా ఆఫీస్, వారి గర్వం" అనే క్యాప్షన్‌ను జతచేశారు. ఆ వీడియోలో, ఆయన తన తల్లిదండ్రులకు గూగుల్ కార్యాలయం మొత్తాన్ని చూపిస్తూ, అక్కడి విశేషాలను వివరిస్తూ కనిపించారు. అనంతరం ఆ కుటుంబమంతా కలిసి అక్కడే భోజనం చేశారు. తమ కుమారుడు సాధించిన విజయాన్ని కళ్లారా చూసిన ఆ తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కష్టపడి చదివించి, ప్రయోజకులగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు తాము సాధించిన విజయాన్ని కళ్లారా చూపించడం కంటే మించిన మధురానుభూతి మరొకటి ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిల్లల ఉన్నత స్థితిని చూసి తల్లిదండ్రులు పొందే ఆనందానికి ఈ వీడియో అద్దం పడుతోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
Advertisement
Google Employee
Bengaluru Google Office
Viral Instagram Video
Parents Pride
Emotional Family Moment

More Telugu News