Advertisement

జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా శ్రీలంక షెడ్యూల్ రద్దు!

Jr NTR Dragon Movie Sri Lanka Schedule Cancelled
  • ఇటీవల గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్
  • 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు
  • సినిమాను వచ్చే ఏడాది జూన్ లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మేకర్స్

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవల హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమవడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, వైద్యుల సూచన మేరకు తారక్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని, కంగారు పడాల్సిన పనిలేదని ఆయన టీమ్ భరోసా ఇచ్చింది.


వైద్యులు ఎన్టీఆర్‌ను సుమారు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టం చేయడంతో, ‘డ్రాగన్’ చిత్రీకరణను మేకర్స్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన భారీ శ్రీలంక షెడ్యూల్‌ను పూర్తిగా రద్దు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కోలుకుని మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే.. అంటే సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ ప్రారంభంలో ఈ కొత్త షెడ్యూల్‌ను తిరిగి పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.


ప్లానింగ్ ప్రకారం ఈ చిత్రాన్ని 2027 జూన్ 11 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్మాతలు పనిచేస్తున్నారు. షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడినా పోస్ట్ ప్రొడక్షన్, డెడ్‌లైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.


ప్రమాద ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో #GetWellSoonNTR హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని, మరింత శక్తివంతంగా కెమెరా ముందుకు రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
Jr NTR
Prashanth Neel
Dragon Movie
Sri Lanka Schedule
Jr NTR Injury
NTR Dragon Shooting Update

More Telugu News