Advertisement

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కొత్త అధ్యాయం.. మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డా: డిప్యూటీ సీఎం పవన్

  • ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కీలకమన్న పవన్
  • దేశాన్ని మోదీ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంస
  • చంద్రబాబు మార్గనిర్దేశంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా మారుతుందని ధీమా
  • ప్రధాని మోదీని విమర్శించడం తనను బాధించిందని వ్యాఖ్య
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. 

ప్రధాని మోదీ 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశాన్ని 'వికసిత్ భారత్' దిశగా వేగంగా నడిపిస్తున్నారని పవన్ కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎదుర్కొన్న విమర్శలను పవన్ గుర్తుచేసుకున్నారు. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధానిని కొందరు విమర్శిస్తున్నప్పుడు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, వెనక్కి లాగే ప్రయత్నాలు జరిగినా మోదీ ఎక్కడా భయపడలేదని ప్రశంసించారు. మోదీ లాంటి ప్రధాని దేశానికి లభించడం అందరి అదృష్టమని, తనను దూషించిన వారిని కూడా క్షమించే గొప్ప గుణం ఆయనదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Advertisement

More Telugu News