శ్రీవారి సేవకులకు 'సిబిల్' తరహా రేటింగ్.. టీటీడీ కొత్త విధానం!

Both States
Advertisement
  • పనితీరు ఆధారంగా సేవకులకు విధుల కేటాయింపు
  • సీఎం ఆదేశాలతో గ్రామస్థాయిలో శ్రీవారి సేవ విస్తరణకు చర్యలు
  • తిరుపతిలో నేడు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
  • గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా టోకెన్ల పంపిణీ
Advertisement
తిరుమల శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా, ‘సిబిల్‌ స్కోర్‌’ తరహాలో వారికి రేటింగ్ ఇచ్చే నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. మంగళవారం జరిగిన గ్రూప్‌ సూపర్‌వైజర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 వేల ఆలయాలు ఉన్నాయని, వాటిలో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించే అవకాశాలను గుర్తించాల్సి ఉందని రవిచంద్ర వివరించారు. సేవకుల పనితీరును బట్టి రేటింగ్ కేటాయించి, దాని ఆధారంగానే వారికి విధులను కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం గ్రూప్‌ సూపర్‌వైజర్లు సమష్టిగా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

మరోవైపు, తిరుపతిలో బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ (SSD) టోకెన్ల జారీని నిలిపివేసినట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో బుధవారం టోకెన్ల జారీ ఉండదని, శుక్రవారం నాటి దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుండి యథావిధిగా టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.                                
Advertisement

సంబంధిత వార్తలు

TTDSrivari SevakuluCIBIL Rating SystemM RavichandraTirumala SSD TokensTirupati Temple News

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News