గుజరాత్‌లో దేశంలోనే తొలి రైల్వే లయన్ అండర్‌పాస్ నిర్మాణం పూర్తి!
- అమ్రేలిలో అందుబాటులోకి వచ్చిన తొలి లయన్ అండర్‌పాస్
- వెస్ట్రన్ రైల్వే, అటవీ శాఖల సంయుక్త భాగస్వామ్యం
- రైలు ప్రమాదాల్లో సింహాల మరణాలను అడ్డుకునే యత్నం
- రూ. 9.42 కోట్లతో మొత్తం ఐదు అండర్‌పాస్‌లు
ఆసియా సింహాల సంరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో భారత్‌లోనే తొలి ప్రత్యేక 'రైల్వే లయన్ అండర్‌పాస్' నిర్మాణం పూర్తయింది. గిర్ అటవీ ప్రాంతం గుండా వెళ్లే రైలు పట్టాలను దాటే క్రమంలో సింహాలు, ఇతర వన్యప్రాణులు రైళ్లు ఢీకొని మరణించకుండా నివారించడానికి ఈ వినూత్న ప్రాజెక్టును తలపెట్టారు. గుజరాత్ అటవీ శాఖ, వెస్ట్రన్ రైల్వేకి చెందిన భావ్‌నగర్ డివిజన్ సంయుక్తంగా ధాసా-రాజులా, రాజులా-పిపావావ్ రైల్వే మార్గాల్లో దీనిని నిర్మించాయి. వన్యప్రాణుల స్వేచ్ఛా సంచారానికి ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రమాద రహిత రైలు రాకపోకలను సాగించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
మొత్తం రూ. 9.42 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఐదు ప్రత్యేక వన్యప్రాణి అండర్‌పాస్‌లలో మొదటిది ఇప్పుడు విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది. మిగిలిన నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. భావ్‌నగర్ డివిజన్ రైల్వే మేనేజర్ దినేష్ వర్మ మాట్లాడుతూ.. అమ్రేలిలో ప్రారంభించిన ఈ లయన్ అండర్‌పాస్ భావన విజయవంతమై, రైలు ప్రమాదాలు తగ్గితే, దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతాల గుండా వెళ్లే ఇతర రైల్వే మార్గాల్లో కూడా ఇటువంటి కారిడార్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. గిర్ జాతీయ ఉద్యానవనం, దాని చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు ఆసియా సింహాలకు ప్రపంచంలోనే ఏకైక సహజ నివాస స్థలంగా ఉన్నాయి.
ఆహారం, నీరు, సొంత ప్రాంతాల వేట కోసం సింహాలు తరచూ ఈ రద్దీ రైల్వే ట్రాకులను దాటుతుండటంతో గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పిపావావ్ పోర్ట్ రైల్వే ట్రాక్ పరిధిలోని భేరాయ్ ప్రాంతంలో ఈ మొదటి అండర్‌పాస్‌ను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుపై స్థానిక నివాసితులు, పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా సింహాల సంరక్షణలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, రైల్వే శాఖ, అటవీ శాఖ, స్థానిక పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా చేసిన ఈ కృషి వన్యప్రాణుల ప్రాణాలను కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.