సిక్కింలో ఘరో ప్రమాదం.. సొరంగంలో చిక్కుకొని 8 మంది మృతి

Sikkim tunnel accident eight dead and many trapped in hydroelectric project
  • నిర్మాణంలో ఉన్న సొరంగంపై విరిగిపడిన కొండచరియలు
  • తీస్తా స్టేజ్‌-6 జలవిద్యుత్‌ ప్రాజెక్టులో భాగంగా సొరంగ నిర్మాణం
  • సొరంగంలో ఇంకా 18 మందికిపైగా చిక్కుకున్నట్లు అనుమానం
  • మీథేన్‌ వాయువు లీక్‌తో సహాయక చర్యలకు ఆటంకం
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయక చర్యలు
సిక్కింలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో సొరంగం కూలిపోయి, మీథేన్‌ వాయువు లీకైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెంచారు. 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో 18 మందికిపైగా సొరంగంలో చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

దక్షిణ సిక్కింలోని సమర్‌డుంగ్‌లో తీస్తా స్టేజ్‌-6 జలవిద్యుత్‌ ప్రాజెక్టులో భాగంగా పటేల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ సొరంగాన్ని నిర్మిస్తోంది. మీథేన్‌ వాయువు లీక్‌ వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాయువు మోతాదు ఎక్కువగా ఉండటంతో చిక్కుకుపోయిన కార్మికులు ఉన్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకోలేకపోతున్నాయి. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

సొరంగం లోపల పెద్ద పేలుడు లాంటి శబ్దం వినిపించడంతో బయటకు పరుగులు తీశామని బయటపడిన కార్మికులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కొండచరియలు ఎందుకు విరిగిపడ్డాయన్నది ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారి సంఖ్యపై కూడా ఇంకా అధికారిక స్పష్టత లేదని తెలిపారు.
Advertisement
Sikkim
Teesta Stage 6 Project
Tunnel Collapse
Methane Gas Leak
Patel Engineering
South Sikkim Accident

More Telugu News