మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా?
- అధికంగా మద్యం సేవించడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తేల్చిన వైద్య నివేదిక
- మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు వెల్లడి
- బాధితురాలితో సంబంధం ఉందని, ఆధారాలున్నాయని లేఖ రాసిన వైనం
- కేసుపై ఉన్నతస్థాయి కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్న జాతీయ పోలీస్ అకాడమీ
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే, ఇది కేసును తప్పుదోవ పట్టించి, సానుభూతి పొందేందుకు ఆడిన నాటకమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏం జరిగింది?
తనను లైంగికంగా వేధించాడని సహోద్యోగి అయిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి గురైన ఉదయ్, ఆదివారం అమీర్‌పేట్‌లోని తన స్నేహితురాలి గదికి వెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అధిక మోతాదులో మద్యం సేవించి స్పృహ కోల్పోయాడు. సోమవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోవడంతో గదిలో శానిటైజర్ సీసా, మద్యం బాటిళ్లు ఉండటాన్ని గమనించిన అతడి సోదరుడు, స్నేహితులు ఆత్మహత్యాయత్నం చేశాడని భావించారు. వెంటనే ఉదయం 9 గంటల సమయంలో ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అత్యవసర విభాగంలో చికిత్స అందించిన వైద్యులు, రక్త నమూనాలను పరీక్షించారు. ల్యాబ్ నివేదికలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని, కేవలం అధికంగా మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయాడని స్పష్టమైంది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిది ఆత్మహత్యాయత్నం కాదని, కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఈ నాటకం ఆడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మద్యం మత్తులో లేఖ
ఆసుపత్రిలో చేరడానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం మత్తులో ఒక లేఖ రాసినట్లు సమాచారం. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమని, సదరు మహిళా అధికారిణితో తనకు ఏడాది కాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అందులో పేర్కొన్నాడు. తమ మధ్య జరిగిన వాట్సప్ చాట్‌లు, ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పటికే ఆమె భర్తకు పంపినట్లు తెలిపాడు. తన ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళతో పాటు మరో నలుగురు కారణమని ఆరోపించాడు.
రంగంలోకి దిగిన ఎన్‌పీఏ.. పోలీసుల దర్యాప్తు
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో జాతీయ పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అకాడమీ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఒక ఉన్నతస్థాయి అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖకు వివరాలు సమర్పించి ఉదయ్ కృష్ణారెడ్డిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు అత్తాపూర్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అకాడమీ అధికారులతో సమావేశమై, ఘటన జరిగిన రోజుల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. నిందితుడి ఫోన్ కాల్ డేటా, వాట్సప్ చాట్‌లను విశ్లేషించి నిజానిజాలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, ఎన్‌పీఏ అంతర్గత విచారణ పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.