‘టికీ-టాకా 2.0’.. స్పెయిన్ ఆట వెనక అసలు రహస్యం
- 2010లో ‘టికీ-టాకా’ వ్యూహంతో ప్రపంచకప్
- బంతిపై ఆధిపత్యమే దీని వెనక లక్ష్యం
- 2014 తర్వాత వ్యూహంలో మార్పులు
- కోచ్ డి లా ఫ్యుయెంటేతో టికీ-టాకా 2.0 ఆవిర్భావం
- వేగం, వింగర్లతో మరింత దూకుడు
ప్రపంచ ఫుట్‌బాల్‌లో కొన్ని జట్లు ట్రోఫీలు మాత్రమే గెలుస్తాయి. మరికొన్ని జట్లు ఆటనే మార్చేస్తాయి. స్పెయిన్ రెండో కోవకు చెందిన జట్టు. 2010 ఫిఫా ప్రపంచకప్‌లో ‘టికీ-టాకా’ వ్యూహంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసిన స్పెయిన్.. ఇప్పుడు అదే శైలికి ఆధునిక రూపం ఇచ్చి ‘టికీ-టాకా 2.0’తో మరోసారి విశ్వకప్‌ను సొంతం చేసుకుంది. ఒకప్పుడు వందల పాస్‌లతో ప్రత్యర్థులను అలసిపోయేలా చేసిన ఆ జట్టు.. ఇప్పుడు అదే బంతి ఆధిపత్యానికి వేగం, దూకుడు, నేరుగా దాడి చేసే తత్వాన్ని జోడించింది. ఫలితంగా పాత స్పెయిన్ గుర్తుండేలా.. కొత్త ఫుట్‌బాల్‌కు తగ్గట్టుగా ఆడే జట్టుగా అవతరించింది.
టికీ-టాకా అంటే?
టికీ-టాకా అంటే బంతిని ఎక్కువసేపు తమ అధీనంలో ఉంచుకోవడం. ప్రత్యర్థి ఆటగాళ్లను తమవైపు లాగడం. వరుస చిన్న చిన్న పాస్‌లతో ఖాళీ స్థలాలను సృష్టించడం. సరైన సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూడడం ఈ శైలి ప్రత్యేకత. ప్రత్యర్థికి బంతి దొరక్కుండా చేయడమే మొదటి లక్ష్యం. అవకాశం వచ్చిన క్షణంలోనే గోల్ అవకాశాన్ని సృష్టించడం రెండో లక్ష్యం.
కొత్త నిర్వచనం
దక్షిణాఫ్రికాలో జరిగిన 2010 ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆటను ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. బంతి ఎక్కువసేపు తమవద్దే ఉంచుకుంటూ ప్రత్యర్థులను పరుగులు పెట్టించింది. ఏడు మ్యాచుల్లో కేవలం ఎనిమిది గోల్స్ మాత్రమే చేసినా.. ఒక్కో మ్యాచ్‌ను పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోగలిగింది. 2008 యూరో నుంచి 2012 యూరో వరకు స్పెయిన్ ఆధిపత్యానికి టికీ-టాకానే ప్రధాన కారణం. బంతి లేకుండా ప్రత్యర్థి ఏమీ చేయలేని పరిస్థితిని సృష్టించడం ఆ జట్టు గొప్పతనం.
ఎందుకు మారాల్సి వచ్చింది?
కాలం మారింది. ఫుట్‌బాల్ వేగం పెరిగింది. ప్రత్యర్థి జట్లు కూడా టికీ-టాకాకు ఎదురుదాడి చేసే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. 2014 ప్రపంచకప్‌లో స్పెయిన్ ఘోరంగా విఫలమైంది. 2022 ఖతార్ ప్రపంచకప్‌లో అప్పటి స్పెయిన్ కోచ్ లూయిస్ ఎన్‌రికే కూడా పాత శైలిని కొనసాగించినా ఆశించిన ఫలితం రాలేదు. ఎక్కువసేపు బంతిని తమవద్ద ఉంచుకోగలిగినా.. గోల్స్‌గా మార్చలేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
అక్కడే పుట్టింది టికీ-టాకా 2.0
జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టిన లూయిస్ డీ లా ఫ్యుయెంటే పాత టికీ-టాకాను పూర్తిగా పక్కన పెట్టలేదు. దానికి కొత్త ఆలోచనలను జోడించాడు. బంతిని తమ అధీనంలో ఉంచే తత్వాన్ని కొనసాగిస్తూనే.. అవసరమైనప్పుడు వేగంగా ముందుకు వెళ్లడం, తక్కువ పాస్‌లతోనే ప్రమాదకర దాడులు చేయడం, వింగర్లను ప్రధాన ఆయుధంగా మార్చడం, బాక్స్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను పంపించడం వంటి మార్పులు చేశాడు.
దీంతో స్పెయిన్ ఆట మరింత దూకుడుగా మారింది. పాస్‌ల కోసం పాస్‌లు కాకుండా.. ప్రతి పాస్‌కు గోల్ లక్ష్యంగా ఉండేలా వ్యూహాన్ని రూపొందించాడు. మైదానం ఇరువైపుల నుంచి వేగంగా దాడులు చేయడం, మధ్యలో ఖాళీలు సృష్టించి ప్రత్యర్థి రక్షణను ఛేదించడం, వెనుక వరుస ఆటగాళ్లను కూడా దాడిలో భాగం చేయడం టికీ-టాకా 2.0 ప్రత్యేకతగా నిలిచింది.
యూరో-2024లో కొత్త స్పెయిన్
యూరో-2024లో స్పెయిన్ మూడోసారి యూరో ఛాంపియన్‌గా నిలవడం వెనుక టికీ-టాకా 2.0 కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై రెండు గోల్స్ కూడా ఈ కొత్త తత్వానికే అద్దం పట్టాయి. తొలి గోల్‌లో యమాల్ ఇద్దరు డిఫెండర్లను ఆకర్షించి నికో విలియమ్స్‌కు అవకాశం కల్పించాడు. రెండో గోల్‌లో కేవలం ఐదు పాస్‌లతోనే తమ డిఫెన్స్ నుంచి ప్రత్యర్థి గోల్‌ముందు చేరుకుని మ్యాచ్‌ను ముగించారు.
ఇది పాత స్పెయిన్‌తో పోలిస్తే పెద్ద మార్పు. ఒకప్పుడు వందల పాస్‌ల తర్వాత అవకాశం వచ్చేది. ఇప్పుడు సరైన అవకాశం కనిపిస్తే కొన్ని పాస్‌లతోనే దాడి ముగిస్తున్నారు.
ఇప్పుడూ అదే వ్యూహం
ప్రపంచకప్‌లోనూ స్పెయిన్ ఇదే శైలిని కొనసాగించింది. బంతిని తమ అధీనంలో ఉంచుకుంటూనే, అవకాశం వచ్చినప్పుడు వేగంగా దాడి చేసింది. బంతి కోల్పోయినా వెంటనే తిరిగి దక్కించుకుంది. వింగర్లతో రెండు వైపులా దాడులు చేస్తూ, రోడ్రీ-పెడ్రీలతో మధ్య మైదానాన్ని నియంత్రించింది. ఈ ఆటతీరే స్పెయిన్‌కు ప్రపంచకప్‌ను అందించింది.
గణాంకాల పరంగా చూసినా స్పెయిన్ బంతిపై ఆధిపత్యంలోనే కాకుండా.. గోల్ అవకాశాల సృష్టిలోనూ అగ్రస్థానంలో నిలిచింది. పాత టికీ-టాకాలో కనిపించిన నెమ్మదితనం ఇప్పుడు లేదు. అదే సమయంలో పాస్‌ల కచ్చితత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
టికీ-టాకా మారలేదు
చాలామంది టికీ-టాకా ముగిసిపోయిందని భావించిన సమయంలో స్పెయిన్ దానికి కొత్త జీవం పోసింది. పాత సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చకుండా.. ఆధునిక ఫుట్‌బాల్‌కు అనుగుణంగా తీర్చిదిద్దింది. అందుకే దీనిని ఫుట్‌బాల్ విశ్లేషకులు ‘టికీ-టాకా 2.0’గా అభివర్ణిస్తున్నారు.