అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులకు నాలుగో సంతానం.. ఇది కూడా ఓ చరిత్రే!
- నాలుగో సంతానంగా కుమారుడు జననం
- బాబుకు 'అలెక్ నీల్ వాన్స్' అని నామకరణం
- పదవిలో ఉండగా సంతానాన్ని పొందిన తొలి యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ రికార్డ్
- చివరిసారిగా 1870లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడికి పదవిలో ఉండగా పుట్టిన బాబు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఉషా వాన్స్ దంపతులు తమ నాలుగో సంతానానికి స్వాగతం పలికారు. మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ఉషా వాన్స్ ఆదివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బాబుకు 'అలెక్ నీల్ వెన్స్' అని పేరు పెట్టినట్లు ఈ జంట ఉమ్మడి ప్రకటనలో వెల్లడించింది. ఈ వార్తతో అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. పదవిలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చిన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
అమెరికా రాజకీయ చరిత్రలో ఒక ఉపాధ్యక్షుడు అధికారంలో ఉండగా తండ్రి కావడం అత్యంత అరుదు. చివరిసారిగా 1870లో అప్పటి ఉపాధ్యక్షుడు స్కైలర్ కోల్‌ఫాక్స్ పదవిలో ఉండగా ఆయనకు కుమారుడు జన్మించాడు. అంతకుముందు 1829లో జాన్ సి. కాల్హౌన్ అనే ఉపాధ్యక్షుడికి బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత ఇంత సుదీర్ఘ కాలానికి, అంటే 156 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అరుదైన ఘట్టం జేడీ వాన్స్ (41) రూపంలో పునరావృతమైంది. కాగా, జేడీ వాన్స్ అమెరికా చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మూడో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
తెలుగు మూలాలు.. భారతీయ అమెరికన్లలో హర్షం
అమెరికా రెండో మహిళ అయిన ఉషా వాన్స్ అసలు పేరు ఉషా బాల చిలుకూరి. భారతీయ వలసదారుల కుమార్తె అయిన ఉష కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. బాబుకు 'నీల్' అనే పేరు కలిసి వచ్చేలా 'అలెక్ నీల్ వాన్స్' అని నామకరణం చేయడంతో ఇండో-అమెరికన్ కమ్యూనిటీలో, ముఖ్యంగా తెలుగు వారిలో ఈ వార్త ఆసక్తిని సంతరించుకుంది. యాలే లా స్కూల్‌లో చదువుకునే రోజుల్లో పరిచయమైన జేడీ వాన్స్, ఉష 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇవాన్ (9), వివేక్ (6) అనే ఇద్దరు కుమారులు, మిరాబెల్ (4) అనే కుమార్తె ఉన్నారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, తమకు అండగా నిలిచిన మిలిటరీ వైద్య బృందానికి, వైట్ హౌస్ మెడికల్ యూనిట్‌కు వాన్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.