రెండోసారి ప్రపంచ విజేతగా స్పెయిన్.. కన్నీళ్లతో మైదానాన్ని వీడిన అర్జెంటీనా!

Spain world champions for the second time Argentina leave field in tears
  • ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ ఘనవిజయం
  • ఎక్స్‌ట్రా టైమ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఫెర్రాన్ టోర్రెస్ చారిత్రాత్మక గోల్
  • రెండో ఎల్లో కార్డుతో 10 మందికే పరిమితమైన అర్జెంటీనా జట్టు
  • లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలోని స్పెయిన్‌కు ఇది 2వ ప్రపంచకప్ టైటిల్
  • టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన స్పెయిన్
ఫుట్‌బాల్ ప్రపంచంలో సరికొత్త రాజు అవతరించాడు. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వణికించి స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఎక్స్‌ట్రా టైమ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ చేసిన ఏకైక అద్భుత గోల్‌తో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. 2010లో సౌతాఫ్రికాలో తొలిసారి కప్ గెలిచిన తర్వాత స్పెయిన్‌కు ఇది రెండో ప్రపంచకప్ కావడం విశేషం.

ఎక్స్‌ట్రా టైమ్ ట్విస్ట్.. టోర్రెస్ మెరుపు గోల్
నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. అయితే, మ్యాచ్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ హెడర్ ద్వారా అందించిన పాస్‌ను అందుకున్న ఫెర్రాన్ టోర్రెస్.. తన ఎడమ కాలితో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్‌ను ఏమార్చుతూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ ఒక్క గోల్‌తో స్పెయిన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఆ తర్వాత స్పెయిన్ మరో గోల్ చేసినప్పటికీ, ఫౌల్ కారణంగా అంపైర్ దాన్ని తిరస్కరించారు.

అర్జెంటీనాకు షాక్.. మెస్సీకి నిరాశ
ఈ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ స్పెయిన్ దాడులను పదేపదే అడ్డుకున్నప్పటికీ, అర్జెంటీనా అటాకింగ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. స్పెయిన్ డిఫెండర్లు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని పూర్తిగా కట్టడి చేశారు. దీనికి తోడు నిర్ణీత సమయం ముగిసే లోపు అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ రెండో ఎల్లో కార్డు (రెడ్ కార్డ్) లభించడంతో మైదానం వీడాడు. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ ఓటమితో గత ప్రపంచకప్ విజేత అయిన అర్జెంటీనా టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలం కాగా, లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలోని స్పెయిన్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా నిలిచింది.
Advertisement
Spain
FIFA World Cup 2026
Argentina
Ferran Torres
Lionel Messi
Football World Cup Final

More Telugu News