అవకాశాల కోసం అన్నింటికీ ఒప్పుకోను: కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మనసు చెప్పిందే వింటానంటున్న కాజల్ అగర్వాల్
- అవకాశాల కోసం అన్నింటికీ యస్ చెప్పనని స్పష్టం
- తల్లి అయ్యాక కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని వెల్లడి
- కొడుకు గర్వపడేలా సినిమాలు చేయడమే లక్ష్యమని వ్యాఖ్య
- సోషల్ మీడియాను 'బ్రెయిన్ పాయిజనింగ్' అని అభివర్ణన
చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా రాణిస్తున్న ప్రముఖ నటి కాజల్ అగర్వాల్.. కెరీర్, వ్యక్తిగత జీవితం పట్ల తన దృక్పథం ప్రస్తుతం పూర్తిగా మారిందని వెల్లడించారు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న తాను, ఇప్పుడు మనసుకు నచ్చని విషయాలకు నిర్మొహమాటంగా ‘నో’ చెబుతున్నానని స్పష్టం చేశారు. కేవలం అవకాశాల కోసమే ప్రతిదానికి ‘యస్’ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
నలభై ఏళ్ల వయసులో అడుగుపెట్టి, నాలుగేళ్ల కుమారుడు నీల్‌కు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో తన ఆలోచనా విధానంలో మార్పులు వచ్చాయని కాజల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "ప్రస్తుతం ఏదైనా కథ వింటున్నప్పుడు ఒక తల్లిగా ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో నా కుమారుడు ‘ఇది మా అమ్మ సినిమా’ అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలని కోరుకుంటున్నాను" అని ఆమె తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో శరీరాకృతి, పాత్రల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గినప్పటికీ, ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’లో న్యాయవాది అర్చన పాత్రను పోషిస్తున్నట్లు కాజల్ వివరించారు. తన శారీరక, మానసిక దృఢత్వానికి నిత్యం చేసే యోగా, వారానికి రెండుసార్లు చేసే వెయిట్ ట్రైనింగ్ మరియు శాకాహారమే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, మిగతావన్నీ ఆ తర్వాతేనని ఆమె హితవు పలికారు.
సోషల్ మీడియాను ‘బ్రెయిన్ పాయిజనింగ్’ (మెదడుకు విషం) తో పోల్చిన కాజల్.. మానసిక ప్రశాంతత కోసం దానికి సాధ్యమైనంత దూరంగా ఉండటమే శ్రేయస్కరమని సూచించారు. నటి దీపికా పదుకొణె ప్రతిపాదించిన ఎనిమిది గంటల పని విధానానికి తాను మద్దతు తెలుపుతున్నానని, తన ఒప్పంద పత్రాల్లోనూ ఇటువంటి నిబంధనలను చేర్చుతానని వెల్లడించారు. అంతేకాకుండా, ఆదివారాలను పూర్తిగా తన కుటుంబానికే కేటాయిస్తానని ఆమె స్పష్టం చేశారు.