జపాన్ లో వర్క్ కల్చర్ పై భారతీయుడి వ్యాఖ్యలు వైరల్
- వీకెండ్స్‌లో నో కాల్స్, నిమిషాల లెక్కన ఓవర్ టైమ్ జీతం
- బహుమతులు కాదు.. నెలల జీతం బోనస్‌గా ఇస్తారంటూ సరదా వ్యాఖ్యలు
- మా కలను నువ్వు జీవిస్తున్నావంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
జపాన్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు అక్కడి పని సంస్కృతిపై సరదా వ్యాఖ్యలతో చేసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అక్కడి ఉద్యోగి అనుకూల విధానాలను ప్రశంసిస్తూ, భారతీయ కార్యాలయాల్లోని పరిస్థితులతో పోలుస్తూ అతను వెరైటీగా చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి విశేష స్పందన లభిస్తోంది.
గత 11 ఏళ్లుగా జపాన్‌లో నివసిస్తున్న అజయ్ పాండే అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. జపాన్ కార్యాలయాల్లోని దుర్భరమైన పరిస్థితులంటూ ఆయన కొన్ని అంశాలను తమాషాగా ప్రస్తావించారు. వారానికి మూడు రోజులు మాత్రమే ఆఫీస్‌కు వెళ్లడం, వారాంతాల్లో పని ఒత్తిడి అస్సలు లేకపోవడం, అదనపు సమయం పని చేస్తే ప్రతి 15 నిమిషాలకు లెక్కగట్టి మరీ వేతనం చెల్లించడం, సాధారణ బహుమతులకు బదులుగా ఏకంగా కొన్ని నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వడం వంటి విషయాలు తనకు నచ్చడం లేదని చిరుకోపం నటించారు.
"మా మేనేజర్ వారాంతాల్లో కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయడు. నన్ను అస్సలు పట్టించుకోడు. అప్పుడప్పుడైనా పిలిస్తే బాగుండు కదా?" అంటూ ఆయన చమత్కరించారు. ఓవర్ టైమ్ చేయడానికి దాదాపుగా అనుమతి ఇవ్వరని, ఒకసారి అనుమతి లభిస్తే మాత్రం ప్రతి నిమిషానికి కచ్చితంగా వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'బ్రో.. నువ్వు విజయంతో బాధపడుతున్నావు', ‘మా కలను నువ్వు జీవిస్తున్నావు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి కాలంలో జపాన్‌లో స్థిరపడిన భారతీయులు అక్కడి పని క్రమశిక్షణ, వ్యక్తిగత సమయానికి ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.