దేవెగౌడ ఇంట విషాదం... తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్

Tragedy in Deve Gowda house Chandrababu and Lokesh express deep grief
  • మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సతీమణి చెన్నమ్మ కన్నుమూత
  • ఆమె కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి మాతృమూర్తి
  • చెన్నమ్మ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందన 
  • దేవెగౌడ కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ సంతాపం
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అర్ధాంగి చెన్నమ్మ శనివారం కన్నుమూశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి చెన్నమ్మ మాతృమూర్తి. ఆమె మృతివార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. "శ్రీమతి చెన్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం కలిగింది. మాజీ ప్రధాని దేవెగౌడ గారికి, కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆ కుటుంబానికి ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా చెన్నమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. "మాజీ ప్రధాని దేవెగౌడ గారి అర్ధాంగి చెన్నమ్మ గారి మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. దేవెగౌడ గారికి, కుమారస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని లోకేశ్ పేర్కొన్నారు.
Advertisement
HD Deve Gowda
Chennamma
HD Kumaraswamy
Chandrababu Naidu
Nara Lokesh
JDS

More Telugu News