ఎండ్రిన్ తాగాల్సింది మేము కాదు.. నువ్వే: సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్!

Revanth Reddy slammed by unemployed woman over Endrin comments and job promises
  • కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్‌పై నిరుద్యోగ యువతి ఆస్మా ఆగ్రహం
  • 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపణ
  • సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు
  • బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో వెల్లువెత్తిన నిరసన
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో ఓ నిరుద్యోగ యువతి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆస్మా అనే యువతి నిలదీశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేశారని ఆమె మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువ సంగ్రామ సదస్సు'లో ఆస్మా మాట్లాడుతూ.. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి పెద్ద తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో నిరుద్యోగులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన 'ఎండ్రిన్ తాగాలి' అనే వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆమె తీవ్రంగా స్పందించారు. "ఎండ్రిన్ తాగాల్సింది మేము కాదు.. నువ్వే. ఊరూరూ తిరిగి నిన్ను గెలిపించిన పాపానికి ముందు నువ్వు, తర్వాత రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి" అంటూ సీఎంను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Advertisement
Revanth Reddy
Asma unemployed youth
Telangana job notifications
BRS Yuva Sangrama Sadassu
Congress Youth Declaration
Hyderabad unemployment protest

More Telugu News