ఆమిర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. ఫిర్యాదు అందలేదన్న పోలీసులు!
- ఆమిర్‌ను టార్గెట్ చేసిన వైరల్ పోస్టు
- అర్జూ బిష్ణోయ్ పేరుతో హెచ్చరికలు
- ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేసిన పోస్టు
- వైరల్ ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు
- వైరల్ పోస్టుల ప్రామాణికతను ధ్రువీకరించని పోలీసులు
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జూ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు, ఆడియో కలకలం రేపుతున్నాయి. అయితే ఈ విషయంపై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోస్టు, ఆడియో ప్రామాణికతను నిర్ధారిస్తామని వెల్లడించారు.
వైరల్ పోస్టు ప్రకారం.. అర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేర్లతో ఆమిర్ ఖాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. దేశంలో ‘లవ్ జిహాద్’ పేరుతో తమ సంస్కృతికి వ్యతిరేకంగా భావిస్తున్న అంశాలను ప్రోత్సహిస్తున్న ఆమిర్‌లాంటి వారిని సహించబోమని పోస్టులో పేర్కొన్నారు. అలాంటి చర్యలకు త్వరలోనే సమాధానం ఇస్తామని, సినీ స్టార్‌డమ్‌ను అడ్డం పెట్టుకుని ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారి అహంకారాన్ని అణచివేస్తామని హెచ్చరించారు.
వైరల్ అవుతున్న ఆడియోలోనూ అర్జూ బిష్ణోయ్ పేరుతో మాట్లాడిన వ్యక్తి ఇదే ఆరోపణలు చేశారు. తమ సంస్కృతికి వ్యతిరేకంగా భావిస్తున్న చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, ఆమిర్ ఖాన్, ఆయనతో ఉన్నవారికి ఇది హెచ్చరిక అని పేర్కొన్నారు. ఎక్కడ కనిపించినా గుర్తుండిపోయేలా బుద్ధి చెబుతామని అన్నారు.
ఆమిర్ ఖాన్ ఇటీవల గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.