21 ఏళ్లలో 25 సార్లు బదిలీ... ఎవరీ తుకారాం ముండే?
- మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్‌గా తుకారాం ముంధే బాధ్యతలు
- ఆహార కల్తీ, నాణ్యతా లోపాలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు
- ప్రముఖ పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్ సస్పెన్షన్, కోట్ల విలువైన సరుకులు స్వాధీనం
- ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా 'సేఫ్ మహారాష్ట్ర' కార్యక్రమం
- నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఈ అధికారికి 20 ఏళ్లలో 25 బదిలీలు
నిజాయతీపరుడు, నిక్కచ్చి అధికారిగా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మహారాష్ట్రలోని కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన ఎంతటి నిక్కచ్చి అధికారి అంటే ఆయన ఉద్యోగిగా పనిచేసిన సంవత్సరాల కంటే బదిలీల సంఖ్యనే ఎక్కువగా ఉంది. తన 21 సంవత్సరాల కెరీర్‌లో 25 సార్లు బదిలీ కావడం గమనార్హం.
తుకారాం ముండే మే 25న రాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా కల్తీ ఆహార ఉత్పత్తుల విక్రయాలపై విస్తృతస్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. 'సేఫ్ ఫుడ్, సేఫ్ మెడిసిన్స్, సేఫ్ మహారాష్ట్ర' అనే నినాదంతో ఆయన చేపట్టిన ఈ చర్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా జూలై 14, 15 తేదీల్లో డెయిరీలు, రెస్టారెంట్లు మరియు తయారీ యూనిట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా, పరిశుభ్రత లోపాలు మరియు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ముంబైలోని ప్రముఖ 'పార్శీ డెయిరీ ఫామ్' ఆహార లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. కేవలం ఈ ఒక్క డ్రైవ్‌లోనే రూ. 1.90 కోట్లకు పైగా విలువైన ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
తుకారాం ముండే బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కల్తీ పాలు, పాల ఉత్పత్తులు, రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు, నిషేధిత గుట్కా మరియు తప్పుడు లేబుళ్లు ఉన్న నూనెలపై వందలాది తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో క్రమంలో కోట్లాది రూపాయల విలువైన కల్తీ సరుకులను సీజ్ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన పలు యూనిట్లను మూసివేయించి, అనేక మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిని ఏమాత్రం సహించేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
2005 బ్యాచ్‌కు చెందిన తుకారాం ముండే, ఇప్పటివరకు 25 సార్లు బదిలీకి గురయ్యారు. అవినీతి మరియు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన అనుసరిస్తున్న రాజీలేని వైఖరితో ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన చేపడుతున్న ఈ దాడులపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, ప్రజారోగ్య భద్రతే పరమావధిగా ఆయన తన కర్తవ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.