గర్భవతినని మేనేజర్‌కు మెసేజ్ చేసిన మూడు గంటల్లోనే ఉద్యోగం కోల్పోయిన మహిళ
- మార్నింగ్ సిక్‌నెస్ వల్ల డ్యూటీలో బిస్కెట్లు తినేందుకు అనుమతి కోరడమే కారణమట
- ప్రొబేషన్ పీరియడ్ పాస్ కాలేదంటూ టర్మినేషన్ లెటర్
- "నమ్మి మోసపోయాను, నేనెంత మూర్ఖురాలిని" అంటూ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన మహిళ
- ఇది పక్కా 'ప్రెగ్నెన్సీ వివక్షే' అంటూ సదరు కంపెనీపై నెట్‌లో ఆగ్రహం
కష్టకాలంలో అండగా ఉంటాడనుకున్న మేనేజర్.. ఆ మహిళ జీవితంలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తాను గర్భవతినని, ఆరోగ్యం సహకరించడం లేదని మేనేజర్‌కు చెప్పిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఒక మహిళకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు లెటర్‌ను చేతిలో పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా 'జిన్' అనే మహిళ పంచుకున్న ఈ చేదు అనుభవం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని, నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
బిస్కెట్లు తినడానికి పర్మిషన్ అడిగితే..!
బాధితురాలు షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఆమెకు ఇటీవల తాను గర్భవతినని తెలిసింది. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వచ్చే తీవ్రమైన వాంతులు, అలసట కారణంగా ఆమె ఇబ్బంది పడుతోంది. ఖాళీ కడుపుతో ఉంటే మరింత నీరసించిపోతుండటంతో.. డ్యూటీ సమయంలో నడుస్తూ కొన్ని బిస్కెట్లు లేదా క్రాకర్స్ తినేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తన మేనేజర్‌కు వాట్సాప్‌లో సున్నితంగా మెసేజ్ పెట్టింది. ఆఫీసులో ఇటీవల తెచ్చిన కఠినమైన రూల్స్ ప్రకారం.. 6 గంటల షిఫ్ట్ ముగిసే వరకు సిబ్బంది ఏమీ తినకూడదు. అందుకే ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆమె ముందుగానే మేనేజర్ అనుమతి కోరింది.
3 గంటల్లోనే ఊహించని షాక్
మెసేజ్ చూసి మేనేజర్ కనీసం మానవత్వంతో ఆలోచిస్తాడని ఆమె ఆశించింది. కానీ, ఆ మెసేజ్ పంపిన సరిగ్గా మూడు గంటల తర్వాత ఆమె ఈమెయిల్‌కు కంపెనీ నుంచి ఒక అధికారిక లెటర్ వచ్చింది. దాని సారాంశం చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. "నువ్వు ప్రొబేషన్ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తి చేయలేదు, అందుకే నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం" అంటూ వారం రోజుల నోటీసు పీరియడ్‌తో కూడిన మెయిల్ అది.
"నమ్మి మోసపోయాను.. నేనెంత మూర్ఖురాలిని!"
ఈ మెయిల్ స్క్రీన్ షాట్స్‌ను నెట్‌లో పెడుతూ సదరు మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "జీవితంలో ఒక పెద్ద విషయాన్ని పంచుకుంటూ, షిఫ్ట్ సమయంలో చిన్న సాయం చేయమని అడిగాను తప్ప సెలవులు కోరలేదు. ప్రస్తుతం నా జీవితంలో మార్గదర్శకత్వం వహించే పెద్దలెవరూ లేరు, మేనేజర్ అర్థం చేసుకుంటారని నమ్మి ఎంతటి మూర్ఖురాలినయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. ఇంత దారుణంగా నమ్మకద్రోహం చేస్తారని ఊహించలేదు" అంటూ రాసుకొచ్చింది.
కాగా, ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సదరు మేనేజర్, కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది స్పష్టంగా చట్టవిరుద్ధమైన 'ప్రెగ్నెన్సీ వివక్ష' కిందకే వస్తుందని, సదరు కంపెనీపై లీగల్ యాక్షన్ తీసుకుని కోర్టుకు లాగాలంటూ బాధితురాలికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.