డబ్బు లేకపోవడమే బలమైంది.. రూ.2,890 కోట్ల డీల్ చేసిన ఐఐటీయన్ కథ!
- సీవెంట్‌కు గోల్డ్‌కాస్ట్‌ను విక్రయించిన పలాశ్ సోనీ
- డబ్బు కొరతే ఫోకస్‌కు కారణమన్న పలాశ్
- ఒకే లక్ష్యంపై దృష్టితో విజయం వరించిందని వివరణ
- కొత్త అవకాశాన్ని గుర్తించడమే టర్నింగ్ పాయింట్
- గోల్డ్‌కాస్ట్‌పై నమ్మకం వదల్లేదన్న ఐఐటీయన్
స్టార్టప్‌ను ప్రారంభించేటప్పుడు భారీ పెట్టుబడులు, పెద్ద బృందం ఉంటేనే విజయం సాధ్యమవుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, తన అనుభవం మాత్రం అందుకు పూర్తిగా భిన్నమని ఓ ఐఐటీ పూర్వ విద్యార్థి చెబుతున్నారు. నిధుల కొరత తమను ఒకే స్పష్టమైన లక్ష్యం దిశగా నడిపించిందని, చివరకు అదే రూ.వేల కోట్ల విలువైన కంపెనీగా ఎదిగేందుకు మార్గం సుగమం చేసిందని వెల్లడించారు.
ఐఐటీ కాన్పూర్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన పలాశ్ సోనీ.. ‘గోల్డ్‌కాస్ట్’ అనే బీ2బీ వీడియో ప్లాట్‌ఫామ్ సహ వ్యవస్థాపకుడు. 2025 డిసెంబరులో ఈ కంపెనీని బ్లాక్‌స్టోన్ మద్దతున్న ‘సీవెంట్’కు 300 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2,890 కోట్లు) విక్రయించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యాపార ప్రయాణంలో నేర్చుకున్న కీలక పాఠాలను పంచుకున్నారు.
తమ వద్ద తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం ప్రారంభంలో లోపంగా అనిపించినా, తర్వాత అదే అతిపెద్ద బలంగా మారిందని సోనీ తెలిపారు. పరిమిత నిధుల కారణంగా ఏకకాలంలో పలు అంశాలపై దృష్టి సారించే అవకాశం లేకపోయిందని, తద్వారా ఒకే లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత పెట్టాల్సి వచ్చిందని వివరించారు. దీనివల్లే మార్కెట్‌లో ఇతరులు గుర్తించలేని అవకాశాలను అందిపుచ్చుకొని తాము ముందుకు సాగగలిగామని పేర్కొన్నారు.
తన కళాశాల రోజుల్లో ‘కౌంటర్-స్ట్రైక్’ గేమ్ ఆడిన అనుభవాన్ని పలాశ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒక అభ్యాసకుడిగా తాను ఎన్నో పొరపాట్లు చేసేవాడినని, అయితే ప్రతీది తెలుసన్న అహంకారం లేకపోవడం వల్లే కొత్త విషయాలను వేగంగా నేర్చుకోగలిగానని చెప్పారు. వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కూడా తాము అదే ధోరణితో ముందడుగు వేశామని వెల్లడించారు.
‘గోల్డ్‌కాస్ట్’ సామర్థ్యంపై తమకున్న నమ్మకాన్ని మొదట్లో ఇన్వెస్టర్లు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని సోనీ తెలిపారు. అందుకే పెట్టుబడులను సమీకరించడం తమకు అంత సులభం కాలేదన్నారు. అయినప్పటికీ, మార్కెట్‌లో తాము గుర్తించిన వ్యాపార అవకాశంపై ఎక్కడా విశ్వాసం కోల్పోలేదని చెప్పారు. చివరకు ఆ అచంచలమైన నమ్మకమే తమ కంపెనీని రూ. 2,890 కోట్ల విలువైన భారీ డీల్ వరకు తీసుకెళ్లిందని వివరించారు.