వేతనం, ప్రమోషన్లు.. ఇవేవీ ఉత్తమ ఉద్యోగిని ఆపలేకపోయాయి: సీఈఓ పోస్ట్ వైరల్!
- మరో విభాగంలోకి మారతానని కోరిన ఉద్యోగి
- రెండేళ్ల పాటు స్పందించని కంపెనీ
- మరో కంపెనీలో అవకాశం ఇవ్వడంతో మార్పు
- ఏదో ఒక సమాధానం చెప్పాల్సిందన్న సీఈఓ
- ఇప్పుడు వ్యవస్థను మార్చామని వివరణ
ఒక ఉద్యోగి సంస్థను ఎందుకు వదిలి వెళతాడు? ఎక్కువ జీతమా, మంచి పదవా, లేక మరో కారణమా? చాలా మంది మొదట చెప్పే సమాధానం జీతమే. కానీ ఓ కంపెనీ సీఈవో పంచుకున్న అనుభవం మాత్రం దీనికి భిన్నమైన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. డబ్బు కోసం కాదు... రెండేళ్ల పాటు తన అభ్యర్థనకు స్పందన లేకపోవడంతోనే తమ అత్యుత్తమ ఉద్యోగిని కోల్పోయామని ఆయన వెల్లడించారు.
లింక్డిన్‌లో ఈ విషయాన్ని పంచుకున్న సీఈవో అల్పేశ్ వాఘాసియా, నాలుగేళ్లుగా సంస్థలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి గురించి వివరించారు. ఆమెకు రెండు ప్రమోషన్లు వచ్చాయని, బృందంలో ఎంతో కీలకమైన ఉద్యోగిగా గుర్తింపు ఉందని చెప్పారు. మరో కంపెనీ ఎక్కువ జీతం ఇవ్వడంతోనే ఆమె వెళ్లిపోతోందని తొలుత భావించినట్లు తెలిపారు.
అయితే అసలు కారణం వేరేనని ఎగ్జిట్ ఇంటర్వ్యూలో తెలిసిందన్నారు. తనకు ఆసక్తి ఉన్న మరో విభాగంలో పని చేసే అవకాశం కల్పించాలని ఆ ఉద్యోగి రెండేళ్లుగా కోరుతూ వచ్చిందని చెప్పారు. పనితీరు సమీక్షల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినా, మేనేజర్ నమోదు చేసుకోవడం తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. తిరస్కరించలేదని, అలాగే ఆమోదించనూ లేదన్నారు. ఆమె అభ్యర్థన అలాగే పెండింగ్‌లోనే ఉండిపోయిందన్నారు.
చివరకు మరో కంపెనీలో ఆమె ఆసక్తికి అనుగుణంగా అవకాశం ఇవ్వడంతో అక్కడ చేరిపోయిందని వివరించారు. ఈ ఘటన తమ సంస్థలోని లోపాన్ని బయటపెట్టిందని సీఈవో అంగీకరించారు. ఉద్యోగుల అభ్యర్థనపై నిర్ణయం తీసుకునే వ్యవస్థ లేకపోవడమే అసలు సమస్యగా గుర్తించామని చెప్పారు.
ఈ ఘటన తర్వాత కంపెనీ విధానాన్ని మార్చినట్లు వెల్లడించారు. ఇకపై ఉద్యోగుల అభివృద్ధికి సంబంధించిన ప్రతి అభ్యర్థనకు ఒక బాధ్యుడిని నియమించి, నిర్ణీత గడువులో సమాధానం ఇచ్చే విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థనను తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేకపోయినా, స్పష్టమైన సమాధానం మాత్రం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ పోస్టుకు లింక్డిన్‌లో మంచి స్పందన లభించింది. ‘నో’ అని చెప్పినా ఉద్యోగులు అంగీకరిస్తారు కానీ, ఎలాంటి స్పందన లేకపోవడమే సంస్థను వదిలి వెళ్లేలా చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.