కష్టాలు లేనిది ఎవరికి?: నటుడు 'శుభలేఖ' సుధాకర్

Subhalekha Sudhakar Interview
  • నటుడిగా పేరు సంపాదించుకున్న సుధాకర్ 
  • ఆర్ధిక ఇబ్బందులు చూశానని వెల్లడి
  • ఆకలి బాధ తెలుసని వివరణ
  • టీవీ సీరియల్స్ ఆదుకున్నాయని వ్యాఖ్య

'శుభలేఖ' సుధాకర్ .. విభిన్నమైన పాత్రలకు కెరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తారు. ఇటు సినిమాలలోను .. అటు సీరియల్స్ లోను ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించినవారాయన. తాజాగా ' సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నటన అంటే చాలా ఇష్టంగా ఉండేది. అదే నన్ను సినిమాల వైపుకు నడిపించింది. 'శివ' సినిమా తరువాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఏం చేయాలో .. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి అది" అని అన్నారు.

"జీవితంలో కష్టాలు లేనివారంటూ ఎవరూ ఉండరు. ఎవరికి ఉండవలసిన కష్టాలు వారికి ఉంటూనే ఉంటాయి. అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. అందువలన నాకు ఆకలి బాధ తెలుసు. ఎవరైనా ఆకలి అంటే.. సాయం చేయకుండా ఉండలేను. అలా ఎంతోమందికి సాయం చేసినవాడిని నేను. అయితే కొంతమంది దానిని అవకాశంగా తీసుకుంటున్నారని గ్రహించిన తరువాత, అవసరం ఏమిటనేది తెలుసుకున్న తరువాతనే సాయం చేయడం మొదలుపెట్టాను" అని చెప్పారు. 

'ఒకానొక సమయంలో సినిమాలలో పూర్తిగా అవకాశాలు తగ్గినప్పుడు టీవీ సీరియల్స్ నాకు అన్నం పెట్టాయి. అందువలన నేను వాటితోనే బిజీ అయ్యాను. ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాలలో మంచి వేషాలు పడుతున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. టీవీ .. సినిమా అనే వాటిని నేను వేరుగా చూడను. నటుడిగా ముందుకు వెళుతున్నానా లేదా అనేది మాత్రమే చూస్తాను. నేను భగవంతుడిని బలంగా నమ్ముతాను. మన ప్రయత్నం మంచిదైతే .. అందులో నిజాయితీ ఉంటే ఆయన సాయం తప్పకుండా అందుతుంది" అని అన్నారు. 

Advertisement
Subhalekha Sudhakar
Telugu Actor
Suman TV Interview
Subhalekha Sudhakar Movies and Serials
Shiva Movie Actor
Subhalekha Sudhakar Life Struggles

More Telugu News