పతంజలి ఫుడ్స్ షేర్లు 20 శాతం పతనం.. ఆరేళ్ల కనిష్ఠానికి చేరిన స్టాక్
- ఓ దశలో రూ.328.20కు పడిపోయిన షేరు ధర
- పతనానికి కారణమయ్యే ఎలాంటి కీలక పరిణామాలు లేవన్న కంపెనీ
- ఈ ఏడాదిలోనే 38 శాతం విలువ కోల్పోయిన షేరు
- గతనెలలోనే 19 శాతం పతనం
పతంజలి ఫుడ్స్ షేర్లు బుధవారం ఒక్కసారిగా 20 శాతం వరకు పతనమై పెట్టుబడిదారులకు భారీ షాక్ ఇచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో షేరు ధర రూ.328.20కు పడిపోయి, 2020 ఏప్రిల్ తర్వాత కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, మధ్యాహ్న ట్రేడింగ్‌లో కూడా సుమారు 16 శాతం నష్టంతో రూ.345 వద్ద కొనసాగింది.
ఈ ఆకస్మిక పతనంపై స్పందించిన కంపెనీ, షేర్ ధర ఇంతగా పడిపోవడానికి కారణమయ్యే ఎలాంటి కీలక పరిణామాలు లేదా ప్రకటించాల్సిన సమాచారం తమ వద్ద లేదని స్టాక్ ఎక్స్చేంజ్‌లకు స్పష్టం చేసింది. కంపెనీ సాధారణంగా తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోందని, లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం బహిర్గతం చేయాల్సిన ఎలాంటి ముఖ్యమైన సమాచారం ప్రస్తుతం లేదని యాజమాన్యం తెలిపింది.
గత కొంతకాలంగా పతంజలి ఫుడ్స్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత నెలలో షేరు దాదాపు 19 శాతం క్షీణించగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 38 శాతం విలువ కోల్పోయింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం గత వారం 16 శాతం, రెండు వారాల్లో 16.7 శాతం, మూడు నెలల్లో 26 శాతం, ఆరు నెలల్లో 36.6 శాతం వరకు ఈ షేరు పడిపోయింది.
గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ పేరుతో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ ఎడిబుల్ ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా ఉంది. వంట నూనెలతో పాటు ఆహార ఉత్పత్తులు, గృహ వినియోగ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.