ముద్రగడ మరణం ఎంతో బాధాకరం.. రాజీపడని వ్యక్తిత్వం ఆయనది: చిరంజీవి భావోద్వేగం
- మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
- ఆయన ఇక లేరన్న వార్త అత్యంత బాధాకరమని వ్యాఖ్య
- ముద్రగడది రాజీపడని వ్యక్తిత్వం అని కొనియాడిన మెగాస్టార్
- ఆయన సేవలు చిరస్మరణీయమని నివాళి
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే చిరంజీవి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ ద్వారా తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
"మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. "ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అంటూ చిరంజీవి నివాళులర్పించారు.