వైసీపీ హయాంలో వేసిన కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
- అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణలకు ఊరట
- అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ అప్పట్లో సీఐడీకి ఫిర్యాదు చేసిన ఆళ్ల
- ఆధారాలు లేవంటూ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు
ఏపీ రాజధానిలోని అసైన్డ్ భూముల విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరువురిపై సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ 2021 ఫిబ్రవరి 24న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చంద్రబాబు, నారాయణపై గతంలో సీఐడీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌కు ఎలాంటి ఆధారాలు లేవంటూ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో చంద్రబాబు, నారాయణ ఊరట పొందారు.
మరోవైపు, వైసీపీ పాలనలో రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమపై వేసిన అన్ని ఆరోపణలను తిప్పికొట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, వైసీపీ పాలనలో రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమపై వేసిన అన్ని ఆరోపణలను తిప్పికొట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.