ఎన్‌డీఏకు శరద్ పవార్ మద్దతు? ఢిల్లీలో కొత్త రాజకీయ చర్చ
- డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ ఎన్సీపీ మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం
- రెండు ఎన్సీపీ వర్గాల నేతల భేటీతో రాజకీయ చర్చ
- బిల్లు తుది రూపాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న సుప్రియా సూలే
- అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచితే మద్దతిస్తామన్న ఎన్సీపీ
- ఈ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని చిదంబరం విజ్ఞప్తి
డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ బిల్లుపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ బిల్లుకు పార్టీ మద్దతు ఇవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే గత పార్లమెంట్ సమావేశంలో బిల్లును వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా నిలిచిన విపక్ష కూటమి వైఖరి నుంచి ఎన్సీపీ వైదొలిగినట్లవుతుంది.
ఈ పరిణామానికి ముందు శరద్ పవార్ వర్గానికి చెందిన నేతలు, అజిత్ పవార్ వర్గ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీంతో రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ ప్రచారాన్ని ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే పూర్తిగా ఖండించలేదు. బిల్లు తుది రూపం ఎలా ఉంటుందన్న దానిపైనే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచుతూ స్పష్టమైన విధానం తీసుకొస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
ఈ డిమాండ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో కూడా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీ బిల్లు తుది ముసాయిదాలో చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఇప్పటికే శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.