సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్

Bandla Ganesh challenges Telangana High Court order in Supreme Court
  • శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్‌కు బ్యాంక్ రుణాలు అందించిన రుణాలకు ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన గణేశ్
  • ఆయన ఆస్తులను వేలం వేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బ్యాంక్ వేలం వేయడాన్ని సమర్థించిన తెలంగాణ హైకోర్టు
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన ఆస్తి వేలం వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్‌కు బ్యాంక్ అందించిన రుణాలకు గాను బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులు తమ ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోన్ తీర్చలేదంటూ... కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో బ్యాంక్ కింద ఆస్తిని వేలం వేయడంతో గణేశ్ డెబ్ట్స్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్ ఆయనకు అనుకూల తీర్పు ఇచ్చింది. వేలం ప్రక్రియను రద్దు చేసి ఆస్తిని తిరిగి అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్ము వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.

అయితే బ్యాంక్ ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు డీఆర్టీ ఉత్తర్వులను కొట్టేసి బ్యాంక్ చర్యలను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గణేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. బండ్ల గణేశ్ ఈ వివాదంపై తన న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కేసు సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Advertisement
Bandla Ganesh
Supreme Court
Union Bank of India
Property Auction
SARFAESI Act
Telangana High Court

More Telugu News