నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్.. అసలు విషయం ఏంటో చూడండి!
- నన్ను నా కూతురు కోర్టుకు తీసుకెళుతోందంటూ ఫన్నీ వీడియో షేర్ చేసిన సమీరా రెడ్డి
- సాధారణంగా పిల్లలు స్కూల్ మీటింగ్స్‌కు తీసుకెళతారని, తన కూతురు మాత్రం భిన్నమన్న నటి
- ‘చిమ్నీ’ అనే హారర్ థ్రిల్లర్‌తో 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సమీరా
- ఓ అరుదైన వైద్య పరిస్థితి ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం
తన కుమార్తె తనను కోర్టుకు తీసుకెళుతోందని ఓ తల్లిగా ప్రముఖ నటి సమీరా రెడ్డి చెప్పడం సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది సీరియస్ విషయం కాదు, కేవలం ఓ సరదా సంఘటన మాత్రమే. ఈ ఊహించని పరిణామం గురించి సమీరా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరదా వీడియోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బుధవారం నాడు సమీరా రెడ్డి పోస్ట్ చేసిన వీడియోలో ఆమె ఇలా మాట్లాడారు, “సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకెళ్తారు? పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లకా? ప్రిన్సిపాల్ ఆఫీసుకా? స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లకా? స్నేహితుల పుట్టినరోజు పార్టీలకైతే తప్పకుండా తీసుకెళతారు. కానీ నా కూతురు నైరా నన్ను ఎక్కడికి తీసుకెళుతోందో తెలుసా? కోర్టుకు! చూడటానికి ఇదొక్కటే మిగిలింది. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి” అని నవ్వుతూ చెప్పారు. "ఇంకా ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నాను" అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు.
సమీరా రెడ్డి, ఆమె భర్త అక్షయ్ వర్దేకు ఇద్దరు పిల్లలు. 2015లో కొడుకు హన్స్, 2019 జులై 12న కూతురు నైరా జన్మించారు. 2014లో వివాహం చేసుకున్న ఈ జంట, తమ కుటుంబానికి సంబంధించిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటారు. సమీరా రెడ్డి తన మాతృత్వపు అనుభవాలను, ప్రసవానంతర డిప్రెషన్, బరువు సమస్యల వంటి సవాళ్లను ధైర్యంగా చర్చిస్తారు. తల్లులు తమను తాము అంగీకరించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆమె ప్రోత్సహిస్తుంటారు.
ఇక సినిమాల విషయానికొస్తే, సమీరా రెడ్డి ఏకంగా 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటనలోకి అడుగుపెడుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ "చిమ్నీ" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె కాళీ అనే పాత్రలో కనిపించనున్నారు. ఓ దెయ్యం పట్టిన ప్యాలెస్‌లో తన కూతురిని కాపాడుకునేందుకు పోరాడే తల్లి కథ ఇది. గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, 'ఫీటస్ ఇన్ ఫెటు' అనే అరుదైన వైద్య పరిస్థితి ఆధారంగా తెరకెక్కుతుండటం విశేషం. ఈ సినిమాలో ప్రాచీ ఠాకూర్, శార్దూల్ రాణా, ఆదిత్య కుమార్ వంటి నటులు కూడా ఉన్నారు.