పీవోకేలో పాక్ దమనకాండ.. ఆరుగురు మృతి, భారత్ తీవ్ర విమర్శ
- పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకే ప్రజల ఆందోళన
- పాక్ పోలీసులు, రేంజర్ల కాల్పుల్లో ఆరుగురు మృతి
- తమ ప్రాణాలు కాపాడాలని భారత్ కు పీవోకే ప్రజల విన్నపం
పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పాక్ పోలీసులు, రేంజర్లు కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. కొంతకాలంగా పీవోకేలో ఇంటర్నెట్ నిలిపివేయడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని నిరసనకారులు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పీవోకే ప్రజలు వాపోతున్నారు. తమ ప్రాణాలను కాపాడాలని, మానవతా సాయం అందించాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. పూంఛ్, దోడా సెక్టార్లలో నియంత్రణ రేఖను తెరవాలని కోరారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలపై పాక్ అణచివేత ధోరణిని భారత్ తీవ్రంగా విమర్శించింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న వ్యవస్థాగత దోపిడీ, బలవంతపు ఆక్రమణలు, అణచివేత వల్లే ఈ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆహారం, మందుల సరఫరా నిలిపివేత, ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్, తీవ్ర హింస పాక్ క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు.
అటు, అమెరికాలో స్థిరపడిన పీవోకే పౌరులు వైట్‌హౌస్ ముందు నిరసన చేపట్టారు. ఈ ఘటనలు పాక్ ఆక్రమణకు వ్యతిరేకంగా పీవోకేలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.