ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి: ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
- హైదరాబాద్‌లో 21 శాతం ఓటరు సవరణ మాత్రమే పూర్తయిందన్న పొన్నం
- ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉందన్న మంత్రి
- ప్రక్రియ పూర్తి కావడానికి ఈ గడువు సరిపోదని వెల్లడి
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. ఓటరు నమోదు ప్రక్రియకు మరింత సమయం కావాలని కోరారు. హైదరాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేవలం 21 శాతం ఓటరు సవరణ మాత్రమే పూర్తయిందని, ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉందని చెప్పారు. మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ సమయం సరిపోదని... ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు.
4,500 పోలింగ్ స్టేషన్లలో ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మంత్రి వెల్లడించారు. బూత్ స్థాయి అధికారులు (BLO) ఇళ్లకు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు సరిగా ఇవ్వడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ క్యాడర్ చురుకుగా పని చేయాలని సూచించారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావనే ప్రచారం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపుపై ఈసీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఉత్కంఠగా మారింది.